Share News

నిర్మలగారి బడ్జెట్‌

ABN , Publish Date - Feb 02 , 2024 | 04:57 AM

రెవెన్యూ లోటును పూడ్చేందుకు రూ.16,85,494 కోట్లు అప్పులు చేయాలని కేంద్రం నిర్ణయించింది.

నిర్మలగారి బడ్జెట్‌

bd.jpg

అప్పులు.. 16,85,494 కోట్లు

రెవెన్యూ లోటును పూడ్చేందుకు రూ.16,85,494 కోట్లు అప్పులు చేయాలని కేంద్రం నిర్ణయించింది. 2023-24లో రూ.17,34,773 కోట్ల అప్పును కేంద్ర సర్కారు తీసుకుంది. 2022-23లో రూ.17,37,755 కోట్లు అప్పులు చేసింది.

పన్నుల ద్వారా 11.7% రాబడి అంచనా

ఈ ఏడాది ప్రత్యక్ష పన్నుల ద్వారా 6.7 శాతం, పరోక్ష పన్నుల ద్వారా 4.9 శాతం ఇలా జీడీపీలో 11.7 శాతం పన్నుల ద్వారా సమకూరుతాయని బడ్జెట్‌ అంచనా వేసింది. 2023-24లో ప్రత్యక్ష పన్నుల ద్వారా 6.6 శాతం, పరోక్ష పన్నుల ద్వారా 5 శాతం.. మొత్తంగా 11.6 శాతం నిధులు సమకూరాయి. 2022-23లో పన్నుల ద్వారా 11.2 శాతం ఆదాయం వచ్చింది.

విద్య, ఆరోగ్యానికి అంతంతే..

ఆరోగ్య రంగానికి కేంద్రం రూ.90,658..63 కోట్లు కేటాయించింది. ఇది మొత్తం బడ్జెట్‌లో 0.9 శాతం మాత్రమే. 2023-24లో 0.79 శాతం, 2022-23లో 0.74 శాతం నిధులను కేంద్రం కేటాయించింది. విద్యా రంగానికి బడ్జెట్‌లో రూ.1,20,627.8 కోట్లు కేటాయించారు. 2023-24లో ఇది రూ.1,12,898.9 కోట్లుగా ఉంది. గత ఏడాది ఇదే రంగానికి రూ.1.12 లక్షల కోట్లు కేటాయించారు.

Updated Date - Feb 02 , 2024 | 04:57 AM