Share News

3,6 తరగతులకు కొత్త పాఠ్య పుస్తకాలు

ABN , Publish Date - Apr 05 , 2024 | 03:24 AM

మూడు, ఆరు తరగతులకు కొత్త సిలబ్‌సతో పాఠ్యపుస్తకాల విడుదల తేదీలను జాతీయ విద్యా పరిశోధనా, శిక్షణ సంస్థ (ఎన్‌సీఈఆర్టీ) గురువారం ప్రకటించింది. మూడో తరగతి పాఠ్య పుస్తకాలు ఈ నెల చివరి వారంనాటికి, ఆరో తరగతి పుస్తకాలు మే మధ్యకాలంనాటికి అందుబాటులో ఉంటాయని పేర్కొంది.

3,6 తరగతులకు కొత్త పాఠ్య పుస్తకాలు

3,6 తరగతులకు కొత్త పాఠ్య పుస్తకాలు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 4: మూడు, ఆరు తరగతులకు కొత్త సిలబ్‌సతో పాఠ్యపుస్తకాల విడుదల తేదీలను జాతీయ విద్యా పరిశోధనా, శిక్షణ సంస్థ (ఎన్‌సీఈఆర్టీ) గురువారం ప్రకటించింది. మూడో తరగతి పాఠ్య పుస్తకాలు ఈ నెల చివరి వారంనాటికి, ఆరో తరగతి పుస్తకాలు మే మధ్యకాలంనాటికి అందుబాటులో ఉంటాయని పేర్కొంది. అలాగే 1, 2, 7, 8, 10, 12 తరగతులకు సంబంధించిన 2023-24 ఎడిషన్స్‌ పాఠ్యపుస్తకాలు దేశవ్యాప్తంగా 1.21 కోట్ల కాపీలు విడుదల చేసినట్టు తెలిపింది.

Updated Date - Apr 05 , 2024 | 07:24 AM