Share News

NASA : భారత వ్యోమగాములకు నాసా ఆధునిక శిక్షణ

ABN , Publish Date - May 26 , 2024 | 06:02 AM

భారత వ్యోమగాములకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) అత్యాధునిక శిక్షణ ఇవ్వనుంది. ఈ ఏడాది, లేదా వచ్చేఏడాది మొదట్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపే సంయుక్త మిషన్‌లో

NASA : భారత వ్యోమగాములకు నాసా ఆధునిక శిక్షణ

వాషింగ్టన్‌, బెంగళూరు, మే 25: భారత వ్యోమగాములకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) అత్యాధునిక శిక్షణ ఇవ్వనుంది. ఈ ఏడాది, లేదా వచ్చేఏడాది మొదట్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపే సంయుక్త మిషన్‌లో భాగంగా ఈ శిక్షణ ఇవ్వనున్నట్టు భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టి చెప్పారు. అమెరికా-భారత్‌ వాణిజ్య మండలి(యూఎ్‌సఐబీసీ), అమెరికా కమర్షియల్‌ స్పేస్‌(యూఎ్‌ససీఎస్‌) సంయుక్తంగా శుక్రవారం బెంగళూరులో నిర్వహించిన సదస్సులో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. అలాగే, పర్యావరణ వ్యవస్థలపై అధ్యయనానికి త్వరలో ఇస్రో నుంచి నిసార్‌ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనున్నట్టు తెలిపారు. నిసార్‌ అనేది నాసా, ఇస్రోల సంయుక్త మిషన్‌ అని చెప్పారు. కాగా, ఇస్రో ప్రధాన కార్యాలయాన్ని ఎరిక్‌ గార్సెట్టి శుక్రవారం సందర్శించారు. ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ను ఆయన కలిశారు. అంతరిక్ష రంగంలో ఇరుదేశాల భాగస్వామ్యం గురించి ఇరువురూ చర్చించారు. ఇరుదేశాల భాగస్వామ్యంతో ‘క్వాడ్‌’ ఉపగ్రహాన్ని రూపొందించాలని ఈ సందర్భంగా గార్సెట్టి ప్రతిపాదించినట్టు ఇస్రో ఒక ప్రకటనలో తెలిపింది.

Updated Date - May 26 , 2024 | 07:21 AM