Share News

Wipro: నారాయణ మూర్తికి జాబ్ ఇచ్చుంటే ఇన్ఫోసిస్ పుట్టేదే కాదు.. విప్రో మాజీ ఛైర్మన్ ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , Publish Date - Jan 14 , 2024 | 10:42 AM

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ ఆర్ నారాయణ(NR Narayana Murthi) మూర్తి గురించి తెలియని వారుంటారా చెప్పండి. రూ.10వేలతో కంపెనీ ప్రారంభించి.. అంచెలంచెలుగా ఎదిగి లక్షల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించారు.

Wipro: నారాయణ మూర్తికి జాబ్ ఇచ్చుంటే ఇన్ఫోసిస్ పుట్టేదే కాదు.. విప్రో మాజీ ఛైర్మన్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఢిల్లీ: ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ ఆర్ నారాయణ(NR Narayana Murthi) మూర్తి గురించి తెలియని వారుంటారా చెప్పండి. రూ.10వేలతో కంపెనీ ప్రారంభించి.. అంచెలంచెలుగా ఎదిగి లక్షల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించారు. అయితే ఆయన గురించి విప్రో మాజీ ఛైర్మన్ అజీమ్ ప్రేమ్ జీ(Ajij Premji) ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నారాయణ మూర్తి 1980 లో విప్రోలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారట.

కానీ ఆయన అప్లికేషన్ ని రిజెక్ట్ చేసిన పరిణామం ఐటీ పరిశ్రమలో అతి పెద్ద పోటీదారుల్లో ఒకటైన ఇన్ఫోసిస్ పుట్టుకకు దారి తీసిందని అన్నారు. 1981లో మూర్తి తన ఆరుగురు స్నేహితులతో కలిసి ఇన్ఫోసిస్‌ని స్థాపించారు. ఇందుకోసం రూ.10వేల పెట్టుబడిని మూర్తి సతీమణి సుధా మూర్తి అందించారు. జనవరి 12, 2024 నాటికి, ఇన్ఫోసిస్ విలువ రూ.6.65 లక్షల కోట్లకు చేరగా విప్రో విలువ రూ.2.43 లక్షల కోట్లకే పరిమితమైంది.

ఇన్ఫోసిస్‌కు మార్గం

IIM అహ్మదాబాద్‌లో రీసెర్చ్ అసోసియేట్‌ ఉద్యోగానికి మూర్తి దరఖాస్తు చేసుకున్నారు. అయితే అక్కడా అప్లికేషన్ రిజెక్ట్ అయింది. దీంతో టెక్ వ్యవస్థాపకుడిగా మారడానికి Mr మూర్తి ప్రయాణం ప్రారంభమైంది. తరువాత ఆయన చీఫ్ సిస్టమ్స్ ప్రోగ్రామర్‌గా పనిచేశాడు. అంచెలంచెలుగా ఎదిగి ఇన్ఫోసిస్ ని ప్రపంచ కంపెనీలతో పోటీ పడే స్థాయికి తీసుకెళ్లారు.


కుటుంబం, వ్యాపారం

వ్యాపారంలో కుటుంబానికి సంబంధించిన మూర్తి, ప్రేమ్‌జీల అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి. రిషద్ ప్రేమ్‌జీ తన తండ్రి 2019లో వైదొలిగిన తర్వాత విప్రోని హ్యాండ్ఓవర్ చేసుకోగా, మూర్తి తన కుమారుడు రోహన్‌ని ఇన్ఫోసిస్‌లో భాగం కావాలని ఎన్నడూ కోరుకోలేదు. ఆయన భార్య కూడా ఇన్ఫోసిస్ లో భాగం కావాలని కోరుకున్నా తాను వద్దని చెప్పానని ఆ నిర్ణయంపై ప్రస్తుతం పశ్చాత్తాపం చెందుతున్నానని అంగీకరించారు.

Updated Date - Jan 14 , 2024 | 10:43 AM