Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

అమెరికాలో భారత నృత్య కళాకారుడి హత్య

ABN , Publish Date - Mar 03 , 2024 | 04:57 AM

అమెరికాలో భారతీయులు, ఇండో-అమెరికన్లపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ముస్సోరిలోని సెయింట్‌ లూయిస్‌ ప్రాంతంలో జరిగిన దాడిలో కోల్‌కతాకు చెందిన కూచిపూడి, భరతనాట్య కళాకారుడు

అమెరికాలో భారత నృత్య కళాకారుడి హత్య

తుపాకీతో పలుమార్లు కాల్చి చంపిన దుండగులు

న్యూయార్క్‌ మార్చి 2: అమెరికాలో భారతీయులు, ఇండో-అమెరికన్లపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ముస్సోరిలోని సెయింట్‌ లూయిస్‌ ప్రాంతంలో జరిగిన దాడిలో కోల్‌కతాకు చెందిన కూచిపూడి, భరతనాట్య కళాకారుడు అమర్‌నాథ్‌ ఘోష్‌ (34) దారుణ హత్యకు గురయ్యారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఘోష్‌ ఉన్నత విద్య కోసం గతేడాది అమెరికాకు వెళ్లారు. సెయింట్‌ లూయి్‌సలోని వాషింగ్టన్‌ యూనివర్సిటీలో పెర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌ విభాగంలో మాస్టర్స్‌ (ఎంఎ్‌ఫఏ) చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం వాకింగ్‌కు వెళ్లిన ఆయనపై గుర్తు తెలియని వ్యక్తులు పలుమార్లు కాల్పులు జరిపారు. ఘోష్‌ అక్కడికక్కడే మృతిచెందారు. కాగా ఘోష్‌ హత్యకు గురైన సమాచారాన్ని ఆయన స్నేహితురాలు, టీవీ నటి దేవలీనా భట్టాచార్జీ శుక్రవారం వెల్లడించారు. మృతదేహాన్ని భారత్‌కు తీసుకురావడంలో సాయం చేయాలని ప్రధాని మోదీ, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు ఆమె విజ్ఞప్తి చేశారు. ఘోష్‌ తండ్రి ఆయన బాల్యంలోనే కన్నుమూయగా, తల్లి మూడు సంవత్సరాల క్రితమే మరణించారని దేవలీనా తెలిపారు. ఈ హత్యకు గల కారణాన్ని తెలుసుకోవాలని భారత రాయబార కార్యాలయాన్ని ఆమె కోరారు. మరోవైపు తుపాకీ దాడిని చికాగోలోని భారత రాయబార కార్యాలయం తీవ్రంగా ఖండించింది. మృతుడి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపింది. ఘోష్‌ బంధువులకు అన్ని విధాల సహాయం అందిస్తామని పేర్కొంది.

Updated Date - Mar 03 , 2024 | 04:57 AM