Share News

ముడా చైర్మన్‌ మరిగౌడ రాజీనామా

ABN , Publish Date - Oct 17 , 2024 | 06:34 AM

మైసూరు నగరాభివృద్ధి సంస్థ(ముడా) చైర్మన్‌ పదవికి కె.మరిగౌడ రాజీనామా చేశారు. ముడా ఇంటి స్థలాల వివాదంపై ఈడీ, లోకాయుక్త దర్యాప్తు చేస్తున్న తరుణంలో

ముడా చైర్మన్‌ మరిగౌడ రాజీనామా

బెంగళూరు, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): మైసూరు నగరాభివృద్ధి సంస్థ(ముడా) చైర్మన్‌ పదవికి కె.మరిగౌడ రాజీనామా చేశారు. ముడా ఇంటి స్థలాల వివాదంపై ఈడీ, లోకాయుక్త దర్యాప్తు చేస్తున్న తరుణంలో ఆయన రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. నగరాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి దీపాచోళన్‌కు బుధవారం ఆయన రాజీనామా లేఖను సమర్పించారు. అనారోగ్య కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. సీఎం సిద్దరామయ్యకు మరిగౌడ అత్యంత ఆప్తులు. 1983 నుంచి సిద్దరామయ్యతోపాటు మరిగౌడ కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతున్నారు. రాజీనామా అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘సీఎం సూచన మేరకు రాజీనామా చేశాను. రాజీనామాకు నా అనారోగ్యం కూడా కారణమే. నాపై ఒత్తిడి ఏమీ లేదు. ఆరోగ్య కారణాలతోనే రాజీనామా చేశాను’ అన్నారు. ‘దర్యాప్తు కొనసాగుతోంది. అవకతవకలు జరిగాయా? లేదా? అనేది దర్యాప్తులో తేలుతుంది’ అని ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

Updated Date - Oct 17 , 2024 | 06:34 AM