Share News

టికెట్ రాకపోవడంతో ఎంపీ ఆత్మహత్య

ABN , Publish Date - Mar 29 , 2024 | 06:26 AM

ఆత్మహత్యాయత్నానికి పాల్పడి నాలుగురోజులుగా ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న తమిళనాడు ఈరోడ్‌ ఎండీఎంకే లోక్‌సభ సభ్యుడు గణేషమూర్తి గురువారం వేకువజామున మృతి చెందారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఎండీఎంకే కోశాధికారిగా ఉన్న గణేషమూర్తి

టికెట్ రాకపోవడంతో ఎంపీ ఆత్మహత్య

పురుగుల మందు తాగిన ఈరోడ్‌ ఎంపీ

నాలుగు రోజులుగా కోయంబత్తూర్‌

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గణేషమూర్తి మృతి

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన

ఈరోడ్‌ ఎండీఎంకే ఎంపీ గణేషమూర్తి మృతి

చెన్నై, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): ఆత్మహత్యాయత్నానికి పాల్పడి నాలుగురోజులుగా ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న తమిళనాడు ఈరోడ్‌ ఎండీఎంకే లోక్‌సభ సభ్యుడు గణేషమూర్తి గురువారం వేకువజామున మృతి చెందారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఎండీఎంకే కోశాధికారిగా ఉన్న గణేషమూర్తి డీఎంకే ఉదయసూర్యుడి గుర్తుపై పోటీ చేసి గెలిచారు. ఈసారి కూడా ఈరోడ్‌ నియోజకవర్గాన్ని డీఎంకే కూటమి కేటాయిస్తుందని, మళ్లీ పోటీ చేయవచ్చునని గణే్‌షమూర్తి ఆశలు పెట్టుకున్నారు. అయితే డీఎంకే అధిష్ఠానం ఎండీఎంకేకు ఈరోడ్‌ నియోజకవర్గానికి బదులుగా ఈసారి తిరుచ్చి నియోజకవర్గాన్ని కేటాయించింది. ఈరోడ్‌లో డీఎంకే పోటీ చేయనుంది. ఈ విషయం తెలిసినప్పటి నుంచి గణే్‌షమూర్తి మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. గత ఆదివారం మధ్యాహ్నం క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

Updated Date - Mar 29 , 2024 | 06:26 AM