PM Modi : ఇక ‘మోదీ కా పరివార్’ను తీసేయండి
ABN , Publish Date - Jun 12 , 2024 | 04:10 AM
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తానిచ్చిన ‘మోదీ కా పరివార్’ నినాదం లక్ష్యం నెరవేరిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. తానిచ్చిన పిలుపు మేరకు సోషల్ మీడియా ఖాతా హ్యాండిల్స్ పేరు పక్కన ‘మోదీ కా పరివార్’

న్యూఢిల్లీ, జూన్ 11: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తానిచ్చిన ‘మోదీ కా పరివార్’ నినాదం లక్ష్యం నెరవేరిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. తానిచ్చిన పిలుపు మేరకు సోషల్ మీడియా ఖాతా హ్యాండిల్స్ పేరు పక్కన ‘మోదీ కా పరివార్’ అనే మాటను చేర్చిన వారు ఇక దానిని తొలగించాలని కోరారు. మోదీకి ఓ కుటుంబమంటూ లేదని లాలూ ప్రసాద్ యాదవ్ విమర్శించారు. ఇందుకు బదులుగా తనని అభిమానించే వారంతా తమ సోషల్ మీడియా హ్యాండిల్ పేరు పక్కన మోదీ కా పరివార్(మోదీ కుటుంబం) అనే మాటను చేర్చాలని మోదీ ఎన్నికల ముందు కోరారు.