వ్యాపారవేత్తల చేతిలో సాధనం మోదీ: రాహుల్
ABN , Publish Date - Apr 17 , 2024 | 02:52 AM
బడా వ్యాపారవేత్తల చేతిలో ప్రధాని మోదీ ఒక సాధనమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. వ్యాపారవేత్తలను రక్షించడం, వారి బ్యాంకు రుణాలను మాఫీ
కోజికోడ్/వయనాడ్(కేరళ), న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: బడా వ్యాపారవేత్తల చేతిలో ప్రధాని మోదీ ఒక సాధనమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. వ్యాపారవేత్తలను రక్షించడం, వారి బ్యాంకు రుణాలను మాఫీ చేయడమే మోదీ పనని ఆయన ఆరోపించారు. మంగళవారం కేరళలోని కోజికోడ్, మలప్పురం జిల్లాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా కొడియాతుర్ రోడ్ షోలో, ఆ తర్వాత వయనాడ్‌లో ర్యాలీలో రాహుల్ పాల్గొన్నారు. ఆ ప్రచార సభల్లో ఆయన మాట్లాడుతూ.. ఎలక్టోరల్ బాండ్లను బలవంతపు వసూళ్లుగా అభివర్ణించారు. 20-25 మంది వ్యాపారవేత్తలకు మోదీ రూ.16 లక్షల కోట్లు ఇచ్చారని అన్నారు.