Share News

ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడి.. భారతీయుడి మృతి

ABN , Publish Date - Mar 06 , 2024 | 03:29 AM

ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా మిలిటెంట్లు చేసిన క్షిపణి దాడిలో ఓ భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు.

ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడి.. భారతీయుడి మృతి

జెరూసలేం, మార్చి 5: ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా మిలిటెంట్లు చేసిన క్షిపణి దాడిలో ఓ భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు భారతీయులు సహా ఏడుగురు విదేశీయులు గాయపడ్డారు. ఈ దుర్ఘటన ఉత్తర ఇజ్రాయెల్‌లో సోమవారం జరిగింది. బాధిత భారతీయులు ముగ్గురిని కేరళ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో హిజ్బుల్లా మిలిటెంట్లు లెబనాన్‌ నుంచి ఉత్తర ఇజ్రాయెల్‌ సరిహద్దు సమీపంలోని ఓ వ్యవసాయక్షేత్రంపై యాంటీ- ట్యాంక్‌ క్షిపణిని ప్రయోగించారని ఇజ్రాయెల్‌ అధికారులు తెలిపారు. ఈ దాడిలో చనిపోయిన వ్యక్తిని కేరళలోని కొల్లామ్‌కు చెందిన పట్నిబిన్‌ మాక్స్‌వెల్‌(31)గా గుర్తించారు. గాయపడిన భారతీయులు బుష్‌ జోసెఫ్‌ జార్జ్‌(31), పాల్‌ మెల్విన్‌(28) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో జోసెఫ్‌ జార్జ్‌ భారత్‌లోని తన కుటుంబసభ్యులతో మాట్లాడారని అధికారులు తెలిపారు.

Updated Date - Mar 06 , 2024 | 03:29 AM