‘మల్లూ హిందూ ఆఫీసర్స్’ గ్రూప్ సృష్టికర్త ఐఏఎస్ గోపాలకృష్ణన్‌పై సస్పెన్షన్ వేటు
ABN , Publish Date - Nov 13 , 2024 | 05:50 AM
కేరళలో కేవలం హిందూ ఐఏఎస్ అధికారుల నంబర్లతో ప్రత్యేకంగా ‘‘మల్లూ హిందూ ఆఫీసర్స్’’ పేరుతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసిన ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణన్‌ను కేరళ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆ వాట్సాప్ గ్రూప్ రాష్ట్రంలోని అఖిల భారత సర్వీసు

న్యూఢిల్లీ, నవంబరు 12: కేరళలో కేవలం హిందూ ఐఏఎస్ అధికారుల నంబర్లతో ప్రత్యేకంగా ‘‘మల్లూ హిందూ ఆఫీసర్స్’’ పేరుతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసిన ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణన్‌ను కేరళ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆ వాట్సాప్ గ్రూప్ రాష్ట్రంలోని అఖిల భారత సర్వీసు అధికారుల మధ్య ఐక్యతను దెబ్బతీసి, విభజన సృష్టించేలా ఉందని సస్పెన్షన్ ఆర్డర్‌లో పేర్కొంది. అందుకే గోపాలకృష్ణన్‌పై చర్యలు తీసుకొన్నట్లు తెలిపింది. వాట్సాప్ గ్రూప్ వివాదం అక్టోబరులో బయటకు వచ్చింది. అయుతే, తన ఫోన్‌ను ఎవరో హ్యాక్ చేశారని, తనకు తెలియకుండా ఆ గ్రూప్‌ను క్రియేట్ చేసి తనను అడ్మిన్‌గా పెట్టారని గోపాలకృష్ణన్ అప్పుడే వివరణ ఇచ్చారు. ఈ వ్యవహారంపై విజయన్ ప్రభుత్వం సీఎస్ శారదా మురళీధరన్ నేతృత్వంలో విచారణ బృందాన్ని నియమించింది. దర్యాప్తు సందర్భంగా గోపాలకృష్ణన్ తన ఫోన్‌ను ఫోరెన్సిక్ పరీక్షకు ఇచ్చేప్పుడు పలుమార్లు రీసెట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో, ఆయనను సస్పెండ్ చేశారు.