విమానం కూలి మలావీ ఉపాధ్యక్షుడి మృతి
ABN , Publish Date - Jun 12 , 2024 | 04:18 AM
ఆప్రికా దేశమైన మలావీలో జరిగిన విమాన ప్రమాదంలో ఆ దేశ ఉపాధ్యక్షుడు సౌలస్ చిలిమా సహా పది మంది మరణించారు. చిలిమా, మరో తొమ్మిది మంది ప్రయాణిస్తున్న ఓ సైనిక విమానం సోమవారం నుంచి

బ్లాంటైర్, జూన్ 11 : ఆప్రికా దేశమైన మలావీలో జరిగిన విమాన ప్రమాదంలో ఆ దేశ ఉపాధ్యక్షుడు సౌలస్ చిలిమా సహా పది మంది మరణించారు. చిలిమా, మరో తొమ్మిది మంది ప్రయాణిస్తున్న ఓ సైనిక విమానం సోమవారం నుంచి కనిపించకుండా పోయింది. గల్లంతైన విమానం కోసం గాలించిన సిబ్బంది 24 గంటల తర్వాత దేశ ఉత్తర ప్రాంతంలోని కొండల్లో విమాన శకలాలను గుర్తించారు. చిలిమా ప్రయాణిస్తున్న విమానం ప్రతికూల వాతావరణం వల్ల కూలిపోయిందని, అందులో ఉన్న వారంతా మరణించారని మలావీ అధ్యక్షుడు లాజరస్ చక్వేరా ప్రకటించారు.