CM of Odisha Majhi sworn : ఒడిసా సీఎంగా మాఝీ ప్రమాణం
ABN , Publish Date - Jun 13 , 2024 | 04:47 AM
ఒడిసాలో తొలిసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ పార్టీ నేత, గిరిజన నాయకుడు మోహన్ చరణ్ మాఝీ ఒడిసా ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం
భువనేశ్వర్, జూన్ 12: ఒడిసాలో తొలిసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ పార్టీ నేత, గిరిజన నాయకుడు మోహన్ చరణ్ మాఝీ ఒడిసా ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సమక్షంలో ఆయన సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. కేవీ సింగ్ డియో, ప్రవతీ పరిడా ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. భువనేశ్వర్‌లోని జనతా మైదాన్‌లో గవర్నర్ రఘుబర్ దాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. వీరితోపాటు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు కూడా హాజరయ్యారు. కాగా, భక్తుల సౌకర్యార్ధం పూరీ జగన్నాథ స్వామి ఆలయంలోని నాలుగు ద్వారాలను గురువారం ఉదయం నుంచి తెరుస్తామని సీఎం మాఝీ బుధవారం ప్రకటించారు. ఇన్నాళ్లూ జగన్నాథ స్వామి ఆలయంలోకి భక్తులను కేవలం ప్రధాన ద్వారం నుంచే అనుమతిస్తున్నారు. కాగా, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పెమా ఖండూ వరుసగా మూడో సారి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఖండూను ఎన్నుకున్నట్టు ఆ పార్టీ వర్గాలు ప్రకటించాయి.