Share News

మహువాపై కొత్త చట్టం బీఎన్‌ఎస్‌ కింద కేసు

ABN , Publish Date - Jul 08 , 2024 | 05:02 AM

జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేఖా శర్మ తన బాస్‌(ప్రధాని మోదీ) పరువు కాపాడే పనిలో బిజీగా ఉన్నారనే అర్థం వచ్చేలా టీఎంసీ ఎంపీ మహువా ఇటీవల చేసిన అభ్యంతరకర

మహువాపై కొత్త చట్టం బీఎన్‌ఎస్‌ కింద కేసు

న్యూఢిల్లీ, జూలై 7: జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేఖా శర్మ తన బాస్‌(ప్రధాని మోదీ) పరువు కాపాడే పనిలో బిజీగా ఉన్నారనే అర్థం వచ్చేలా టీఎంసీ ఎంపీ మహువా ఇటీవల చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై ఆదివారం ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. కొత్త నేర న్యాయ చట్టమైన భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎ్‌స)లోని సెక్షన్‌ 79 (మహిళలను కించపరిచేలా మాట్లాడడం, సంజ్ఞలు చేయడం) కింద కేసు పెట్టారు. మహువా వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్‌ ఆదేశాల మేరకు ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ పోలీసులు ఈ కేసు పెట్టారు.

Updated Date - Jul 08 , 2024 | 05:02 AM