జమ్మూకశ్మీర్ రాష్ట్ర హోదాకు ఎల్జీ ఆమోదం
ABN , Publish Date - Oct 20 , 2024 | 05:31 AM
జమ్మూకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా ఇవ్వాలని సీఎం ఒమర్ అబ్దుల్లా ఆధ్వర్యంలోని మంత్రిమండలి చేసిన తీర్మానానికి లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) మనోజ్ సిన్హా ఆమోదం
శ్రీనగర్, అక్టోబరు 19: జమ్మూకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా ఇవ్వాలని సీఎం ఒమర్ అబ్దుల్లా ఆధ్వర్యంలోని మంత్రిమండలి చేసిన తీర్మానానికి లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) మనోజ్ సిన్హా ఆమోదం తెలిపారు. తీర్మానాన్ని యథాతథంగా ఆమోదించినట్లు ప్రభుత్వ అధికార ప్రతినిధి ఒకరు శనివారం మీడియాకు చెప్పారు. లెఫ్టినెట్ గవర్నర్ ఆమోదం తెలపడంతో జమ్మూకశ్మీర్‌కు కేంద్ర పెద్దలు త్వరలోనే రాష్ట్ర హోదా కల్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై త్వరలోనే సీఎం ఒమర్ అబ్దుల్లా.. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులతో భేటీ కానున్నట్లు నేషనల్ కాన్ఫరెన్స్ నాయకులు తెలిపారు. మరోవైపు ప్రొటెం స్పీకర్‌గా ముబారిక్ గుల్‌ను నియమిస్తూ ఎల్జీ నిర్ణయం తీసుకున్నారు. నవంబరు 4న జమ్మూకశ్మీర్ అసెంబ్లీ సమావేశం జరగనుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.