Share News

Lok Sabha polls: లోక్‌సభ బరిలో ఆజాద్

ABN , Publish Date - Apr 02 , 2024 | 07:36 PM

డెమెక్రటిక్ ప్రోగ్రసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ) అధ్యక్షుడు, జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులామ్ నబీ ఆజాద్ అనంత్ నాగ్ - రాజౌరీ లోక్‌సభ స్థానం నుంచి బరిలో దిగుతున్నారు.

Lok Sabha polls: లోక్‌సభ బరిలో ఆజాద్

శ్రీనగర్, ఏప్రిల్ 02: డెమెక్రటిక్ ప్రోగ్రసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ) Democratic Progressive Azad Party (DPAP) అధ్యక్షుడు, జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులామ్ నబీ ఆజాద్ (Ghulam Nabi Azad) అనంత్ నాగ్ - రాజౌరీ లోక్‌సభ (Anantnag-Rajouri constituency) స్థానం నుంచి బరిలో దిగుతున్నారు. ఈ మేరకు ఆ పార్టీ నాయకుడు తాజ్ మెహియిద్దీన్ మంగళవారం శ్రీనగర్‌లో వెల్లడించారు. అయితే తమ పార్టీ ఇతర పార్టీలతో కలిసి జత కట్టడం లేదని తెలిపారు.

ఎందుకంటే సమయం తక్కువ ఉందని.. మరోవైపు ఇతర రాజకీయ పార్టీల నేతలతో చర్చలు ముందుకు పడలేదని తెలిపారు. అదీకాక ఇతర పార్టీల్లోని నేతలు అనంతనాగ్ సీటు పట్ల అంతగా ఆసక్తి కనబరచ లేదన్నారు. దీంతో డీపీఏపీ ముందుకు వెళ్తుందన్నారు. ఇక కాశ్మీర్‌లోని లోక్‌సభ స్థానాల అభ్యర్థులను త్వరలో నిర్ణయించి ప్రకటిస్తామని స్పష్టం చేశారు.

దక్షిణ కశ్మీర్‌లోని అనంతనాగ్, షోఫియాన్, కుల్గాం జిల్లాతోపాటు జమ్ము ప్రాంతంలోని సరిహద్దు జిల్లాలు రాజౌరీ, పూంచ్‌లోని అధిక భాగం.. అనంతనాగ్ రాజౌరీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉంది.

అనంతనాగ్-రాజౌరీ ప్రస్తుత లోక్‌సభ సభ్యుడిగా నేషనల్ కాన్ఫరెన్స్ నేత, మాజీ న్యాయమూర్తి హస్‌నైని మసూద్ (Hasnain Masoodi) ఉన్నారు. గత ఎన్నికల్లో పీడీపీ అధ్యక్షురాలు మొహబూబా ముఫ్తీ‌ ( Mehbooba Mufti)పై ఆయన ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.

ఇక జమ్ము కశ్మీర్‌లో ఐదు దశల్లో పోలింగ్ ప్రక్రియ జరుగుతోంది. తొలుత ఏప్రిల్ 19న ఉదంపూర్‌లో.., ఏప్రిల్ 26న జమ్ములో.., మే 7న అనంతనాగ్ రాజౌరీలో.., మే 13న శ్రీనగర్‌లో.., మే 20న బారాముల్లాలో.. పోలింగ్ జరగనుంది. జూన్ 4వ తేదీ ఓట్ల లెక్కింపు జరగనుంది. గతంలో అంటే దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆజాద్.. 2022లో ఆ పార్టీకీ రాజీనామా చేశారు. అనంరతం అదే ఏడాది డెమెక్రటిక్ ప్రోగ్రసివ్ ఆజాద్ పార్టీ పేరిట రాజకీయ పార్టీని స్థాపించారు.

మరిన్నీ జాతీయ వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Lok Sabha Elections 2024: పలు రాష్ట్రాలకు ఎన్నికల పరిశీలకులు: సీఈసీ

Amit Shah : ‘వేసవి వస్తే చాలు.. విదేశాలకు జంప్’

Updated Date - Apr 02 , 2024 | 08:05 PM