Share News

Lok Sabha Elecitons 2024: ఏ విడతలో ఎన్ని నియోజకవర్గాలకు పోలింగ్ అంటే...

ABN , Publish Date - Mar 16 , 2024 | 04:44 PM

లోక్‌సభ ఎన్నికలు ఏడు దశల్లో ఉండనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏప్రిల్ 19 నుంచి ప్రారంభమయ్యే తొలి దశ ఎన్నికలు జూన్ 7న జరిగే ఏడో దశ పోలింగ్‌తో ముగుస్తుంది. ఏఏ విడతలో ఎన్ని నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుందో కూడా ప్రకటించింది.

Lok Sabha Elecitons 2024: ఏ విడతలో ఎన్ని నియోజకవర్గాలకు పోలింగ్ అంటే...

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Elections-2024) ఏడు దశల్లో ఉండనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం (Election commission of India- ECI) ప్రకటించింది. ఏప్రిల్ 19 నుంచి ప్రారంభమయ్యే తొలి దశ ఎన్నికలు జూన్ 7న జరిగే ఏడో దశ పోలింగ్‌తో ముగుస్తుంది. ఏఏ విడతలో ఎన్ని నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుందో కూడా ప్రకటించింది.


ఏడు దశలు...నియోజకవర్గాలు

ఈసీసీ ప్రకటించిన ప్రకారం, ఏప్రిల్ 19న తొలిదశ ఎన్నికల్లో 102 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగనుంది. రెండో విడత ఏప్రిల్ 26న 89 నియోజవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. మూడో విడత మే 7న 94 నియోజకవర్గాల్లో పోలింగ్ ఉంటుంది. నాలుగో విడత మే 13న 96 నియోజకవర్గాల్లో , మే 20న ఐదవ విడత 49 నియోజకవర్గాల్లో, మే 25న ఆరో విడత 57 నియోజకవర్గాల్లో, జూన్ 1న ఏడో విడత 57 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు.

Updated Date - Mar 16 , 2024 | 04:44 PM