Share News

ప్రభుత్వాలు మారినప్పుడు లాయర్లను మార్చుకోవచ్చు

ABN , Publish Date - Apr 03 , 2024 | 03:17 AM

ప్రభుత్వాలు మారినప్పుడు లాయర్లను మార్చుకునే అధికారం రాష్ట్రాలకు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే కోర్టు కార్యకలాపాలకు విఘాతం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

ప్రభుత్వాలు మారినప్పుడు లాయర్లను మార్చుకోవచ్చు

అయితే ఆరు వారాల వరకు పాతవారిని కొనసాగించాలి: సుప్రీం

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 2: ప్రభుత్వాలు మారినప్పుడు లాయర్లను మార్చుకునే అధికారం రాష్ట్రాలకు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే కోర్టు కార్యకలాపాలకు విఘాతం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అడ్వకేట్ల ప్యానెల్‌ను మార్చుకొనే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నప్పటికీ కనీసం ఆరు వారాల వరకు పాత ప్యానెల్‌ను కొనసాగించాల్సి ఉంటుందని తెలిపింది. పాత లాయర్లు లేకుంటే కేసుల విచారణను గత్యంతరం లేక వాయిదా వేయాల్సిన పరిస్థితులు కోర్టులకు ఎదురవుతాయని పేర్కొంది. అలా జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా, జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ల ధర్మాసనం తెలిపింది. ఈ మేరకు సర్క్యులర్‌ను పంపించాలని రిజస్ట్రీని ఆదేశించింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ నిందితునికి బెయిల్‌ మంజూరుకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా ఈ ఆదేశాలు ఇచ్చింది.

Updated Date - Apr 03 , 2024 | 03:17 AM