Share News

కేజ్రీవాల్‌ విశ్వాస తీర్మానం

ABN , Publish Date - Feb 17 , 2024 | 03:20 AM

మద్యం పాలసీ కేసులో ఈడీ పదే పదే సమన్లు పంపిస్తుండడం, విచారణకు హాజరు కావాలంటూ కోర్టు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో..

కేజ్రీవాల్‌ విశ్వాస తీర్మానం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: మద్యం పాలసీ కేసులో ఈడీ పదే పదే సమన్లు పంపిస్తుండడం, విచారణకు హాజరు కావాలంటూ కోర్టు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనపై, తన ప్రభుత్వంపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజల్లో విశ్వాసం ఉందని నిరూపించుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు శుక్రవారం శాసనసభలో స్వయంగా విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. బీజేపీ నేతలు తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నుతున్నారని కేజ్రీవాల్‌ ఆరోపించారు. కాగా, ఈ విశ్వాస తీర్మానంపై అసెంబ్లీలో శనివారం చర్చ జరగనుంది. ఢిల్లీ శాసనసభలో 70 స్థానాలకుగాను ఆప్‌కు 62 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

Updated Date - Feb 17 , 2024 | 07:47 AM