కేజ్రీవాల్‌ను వెంటనే విడుదల చేయాలి
ABN , Publish Date - Jul 31 , 2024 | 06:03 AM
ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో జైల్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కన్వీనర్ కేజ్రీవాల్‌ను వెంటనే విడుదల చేయాలని ఇండియా కూటమి నేతలు డిమాండ్ చేశారు.
న్యూఢిల్లీ, జూలై 30: ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో జైల్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కన్వీనర్ కేజ్రీవాల్‌ను వెంటనే విడుదల చేయాలని ఇండియా కూటమి నేతలు డిమాండ్ చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆప్ పిలుపు మేరకు కూటమిలోని పార్టీలకు చెందిన పలువురు నేతలు మంగళవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ర్యాలీలో పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విపక్షాల గొంతు నొక్కేస్తోందని ఆరోపించారు. ఢిల్లీ ప్రభుత్వ అధికారాల్లోనూ కేంద్రం జోక్యం చేసుకుంటోందని, రాజిందర్‌నగర్‌లో ముగ్గురు సివిల్స్ అభ్యర్థుల మరణానికి ఇదే కారణమని విమర్శించారు. హరియాణా, జార్ఖండ్, మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీని ఓడించాలన్నారు.