పిల్లలను ప్రచారానికి దూరం పెట్టండి
ABN , Publish Date - Feb 06 , 2024 | 03:29 AM
లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న క్రమంలో రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.
అభ్యర్థులు వారిని ఎత్తుకోవడమూ ఉల్లంఘనే: ఈసీ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న క్రమంలో రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో ఏ విధంగానూ పిల్లలను ఉపయోగించుకోవద్దని సూచించింది. పోస్టర్లు, కరపత్రాల పంపిణీ, నినాదాలివ్వడం, ర్యాలీల్లో తిప్పడం వంటి ప్రచార కార్యక్రమాల్లో పిల్లలను వాడుకోవద్దని తెలిపింది. అభ్యర్థులు పిల్లలను ఎత్తుకోవడం, వాహనాల్లో తిప్పడంతో పాటు తమకు అనుకూలంగా పాటలు/పద్యాలు పాడించడం, డ్యాన్సులు చేయించడం, మాట్లాడించడం ఉల్లంఘన కిందకే వస్తాయని పేర్కొంది.