రాష్ట్రాలకు నిధులపై కర్ణాటక వర్సెస్ కేంద్రం
ABN , Publish Date - Feb 06 , 2024 | 03:28 AM
కర్ణాటకపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపుతోందని.. నిధుల్లో కోత పెడుతోందని.. విపత్తు నిధులివ్వడం లేదని సిద్దరామయ్య సర్కారు ఆరోపిస్తోంది. దీనిపై బుధవారం ఢిల్లీలోని
రేపు ఢిల్లీలో కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల ధర్నా
బెంగళూరు-ఆంధ్రజ్యోతి/న్యూఢిల్లీ,ఫిబ్రవరి 5: కర్ణాటకపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపుతోందని.. నిధుల్లో కోత పెడుతోందని.. విపత్తు నిధులివ్వడం లేదని సిద్దరామయ్య సర్కారు ఆరోపిస్తోంది. దీనిపై బుధవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ధర్నాకు పిలుపిచ్చింది. ఈ విషయాన్ని సోమవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ చౌధురి ప్రస్తావించారు. ఆరు నెలల కిందట కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అంతా బాగానే ఉందని.. ఇప్పుడక్కడ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్రానికి కేంద్రం నిధులు ఆపుతోందని, దక్షిణ భారతంపై వివక్ష చూపుతోందని ఆరోపించారు. ఈ ఆరోపణలను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఖండించారు. దక్షిణాదికి.. ముఖ్యంగా కర్ణాటకకు నిధులు ఆపామనడం స్వార్థ శక్తుల పన్నాగమని.. రాజకీయ ప్రేరిత ఆరోపణలని.. అలా ఎప్పటికీ జరగదని అన్నారు.