Share News

Student Teacher Photoshoot: విద్యార్థితో టీచర్ రొమాంటిక్ ఫోటోషూట్.. నెట్టింట్లో ఫోటోలు వైరల్

ABN , Publish Date - Jan 01 , 2024 | 07:51 PM

విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ మహిళా ఉపాధ్యాయురాలు దారి తప్పింది. తాను పాఠాలు చెప్పే విద్యార్థితో కలిసి అభ్యంతకరమైన పనికి పాల్పడింది. ఒక విహారయాత్రలో భాగంగా.. ఆ విద్యార్థితో కలిసి రొమాంటిక్ ఫోటోషూట్ చేసింది.

Student Teacher Photoshoot: విద్యార్థితో టీచర్ రొమాంటిక్ ఫోటోషూట్.. నెట్టింట్లో ఫోటోలు వైరల్

Teacher Student Photoshoot: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ మహిళా ఉపాధ్యాయురాలు దారి తప్పింది. తాను పాఠాలు చెప్పే విద్యార్థితో కలిసి అభ్యంతకరమైన పనికి పాల్పడింది. ఒక విహారయాత్రలో భాగంగా.. ఆ విద్యార్థితో కలిసి రొమాంటిక్ ఫోటోషూట్ చేసింది. చీర లాగడం, కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టుకోవడం వంటి పోజులతో ఫోటోలు దిగింది. ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ కావడంతో.. నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఆ టీచర్‌పై సస్పెన్షన్ వేటు కూడా పడినట్టు కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

కర్ణాటకలోని చిక్కబళ్లాపుర జిల్లా చింతామణి తాలూకా మురుగమల్లా గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 42 ఏళ్ల మహిళ ప్రధానోపాధ్యాయురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. గతేడాది డిసెంబర్ 22 నుంచి 25 తేదీల మధ్య విద్యార్థులను హొరనాడు, ధర్మస్థల, యానాలతో పాటు ఇతర ప్రాంతాలకు విద్యా పర్యటన కోసం తీసుకెళ్లారు. ఈ సందర్భంగానే.. ఆ టీచర్ తన విద్యార్థితో కలిసి ఈ రొమాంటిక్ ఫోటోషూట్ చేసినట్లు తెలిసింది. మరో విద్యార్థి ఈ ఫోటోలను ఆమె ఫోన్‌లో తీశాడు. ప్రాథమిక విచారణలో భాగంగా.. ఈ ఫోటోషూట్ వ్యవహారం ఆ ముగ్గురికి మాత్రమే తెలుసని తేలింది. మిగిలిన విద్యార్థులకు, ఇతర టీచర్లకు ఏమాత్రం తెలియదని వెల్లడైంది.


అయితే.. విద్యార్థితో టీచర్ దిగిన ఆ రొమాంటిక్ ఫోటోలు ఒక్కసారిగా సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. దాంతో అవి వైరల్‌గా మారడంతో.. వ్యవహారం వివాదాస్పదంగా మారింది. దీంతో.. చింతామణికి చెందిన జిల్లా విద్యాశాఖాధికారి ఉమాదేవి వెంటనే ఆ ప్రభుత్వ ఉన్న పాఠశాలను సందర్శించారు. ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు, వంట సిబ్బందితో సహా విహారయాత్రకు వెళ్లిన వారందరిని విచారించారు. ‘‘వైరల్‌గా మారిన ఫోటోలను మరో విద్యార్థి తీసినట్టు తెలిసింది. ఇద్దరు విద్యార్థులు, ప్రధానోపాధ్యాయురాలు మినహా, ఇతర సిబ్బందికి లేదా విద్యార్థికి ఈ సంఘటన గురించి తెలియదు’’ అని ఉమాదేవి మీడియాకు తెలిపారు.

మరోవైపు.. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఈ ఫోటోలపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి. విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయురాలు.. విద్యార్థులతో ఇలాంటి పాడు పనులు చేయడమేంటని ప్రశ్నించారు. ఇలాంటి టీచర్స్ వల్ల స్టూడెంట్లు చెడిపోతారని.. కాబట్టి ఆమెను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. నెటిజన్ల నుంచి సైతం ఇవే డిమాండ్లు వచ్చాయి. దీంతో.. ఆ ప్రధానోపాధ్యాయినిని సర్వీసు నుంచి సస్పెండ్ చేయాలని బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (బీఈవో) సిఫార్సు చేశారు.

Updated Date - Jan 01 , 2024 | 07:51 PM