Share News

28న సోరెన్‌ ప్రమాణ స్వీకారం

ABN , Publish Date - Nov 25 , 2024 | 02:54 AM

ఝార్ఖండ్‌ రాష్ట్ర 14వ ముఖ్యమంత్రిగా జేఎంఎం నేత హేమంత్‌ సోరెన్‌ ఈ నెల 28న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

28న సోరెన్‌ ప్రమాణ స్వీకారం

రాంచీ, నవంబరు 24: ఝార్ఖండ్‌ రాష్ట్ర 14వ ముఖ్యమంత్రిగా జేఎంఎం నేత హేమంత్‌ సోరెన్‌ ఈ నెల 28న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆదివారం ఆయన తన కారులో రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ సంతోష్‌ కుమార్‌ గాంగ్వార్‌ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కూటమి భాగస్వామ్య పక్షాల మద్దతు లేఖను అందజేశారు. దాంతో ప్రభుత్వ ఏర్పాటుకు సోరెన్‌ను గవర్నర్‌ ఆహ్వానించారు. అప్పటి వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా వ్యవహరించాలని కోరారు. ఝార్ఖండ్‌ ఎన్నికల్లో ఇండియా కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Updated Date - Nov 25 , 2024 | 02:56 AM