Share News

మాల్దీవులకు భారత పర్యాటకుల ఝలక్‌

ABN , Publish Date - Jan 31 , 2024 | 05:24 AM

మాల్దీవుల దేశంలో పర్యటించే భారతీయుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇరుదేశాల మధ్య ఏర్పడిన విభేదాలే దీనికి కారణం. గతేడాది మాల్దీవులను అత్యధిక పర్యాటకులు

మాల్దీవులకు భారత పర్యాటకుల ఝలక్‌

న్యూఢిల్లీ, జనవరి 30: మాల్దీవుల దేశంలో పర్యటించే భారతీయుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇరుదేశాల మధ్య ఏర్పడిన విభేదాలే దీనికి కారణం. గతేడాది మాల్దీవులను అత్యధిక పర్యాటకులు సందర్శించిన దేశాల జాబితాలో భారత్‌ తొలి స్థానంలో నిలువగా, ఈ ఏడాది జనవరి 28వ తేదీ నాటికి భారత్‌ 5వ స్థానానికి పరిమితమైంది. మాల్దీవుల పర్యాటక మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఈ ఏడాది జనవరి 28 నాటికి మాలీవులను అత్యధికంగా సందర్శించిన పర్యాటకుల సంఖ్య పరంగా రష్యా(18,561 మంది) తొలి స్థానానికి చేరింది. తర్వాతి స్థానాల్లో ఇటలీ, చైనా, బ్రిటన్‌, భారత్‌(13,989) నిలిచాయి.

Updated Date - Jan 31 , 2024 | 08:48 AM