Share News

Bangladesh : బంగ్లాదేశ్‌ ఎంపీ హత్యకు స్మగ్లింగే కారణమా?

ABN , Publish Date - May 26 , 2024 | 06:00 AM

కోల్‌కతాలో బంగ్లాదేశ్‌ ఎంపీ అన్వరుల్‌ అజీం ఆనర్‌ దారుణ హత్య వెనుక బంగారం స్మగ్లింగే కారణమై ఉంటుందని ఢాకా మెట్రోపాలిటన్‌ డిటెక్టివ్‌ పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన అనుమానితునిగా ఉన్న

Bangladesh  : బంగ్లాదేశ్‌ ఎంపీ హత్యకు స్మగ్లింగే కారణమా?

ఢాకా, మే 25: కోల్‌కతాలో బంగ్లాదేశ్‌ ఎంపీ అన్వరుల్‌ అజీం ఆనర్‌ దారుణ హత్య వెనుక బంగారం స్మగ్లింగే కారణమై ఉంటుందని ఢాకా మెట్రోపాలిటన్‌ డిటెక్టివ్‌ పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన అనుమానితునిగా ఉన్న వ్యాపారవేత్త అఖ్తరుజ్జమాన్‌ షాహిన్‌కు ఎంపీ ఆనర్‌కు మధ్య ఎంతోకాలంగా స్నేహం, వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఇద్దరికీ బంగారం స్మగ్లింగ్‌తో ప్రమేయం ఉంది. ఇటీవల కాలంలో వాటాల పంపిణీలో తేడాలు రావడం వల్లనే హత్య జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులోనూ ఢాకా పోలీసులు పేర్కొన్నారు. అఖ్తరుజ్జమాన్‌ దుబాబ్‌ నుంచి బంగారాన్ని అక్రమంగా తీసుకువస్తే దానిని సురక్షిత ప్రాంతాలకు చేరవేసే బాధ్యతలను ఆనర్‌ చూసుకునేవారు. కాగా, ఈ కేసుకు సంబంధించి బంగ్లాదేశ్‌లో ముగ్గురిని, బెంగాల్‌లో ఒకరిని అరెస్టు చేశారు.

Updated Date - May 26 , 2024 | 07:24 AM