Share News

రెండో ప్రపంచయుద్ధ కాలంలో పరిశోధనలు

ABN , Publish Date - Jan 12 , 2024 | 05:42 AM

ధ్వని తరంగాల వేగం గంటకు 1,235 కి.మీ.లు. దీనినే ఒక మ్యాక్‌ అని కూడా పిలుస్తారు. ఒక మ్యాక్‌ను మించిన వేగంతో ప్రయాణించే విమానాలను సూపర్‌ సానిక్‌ విమానాలంటారు.

రెండో ప్రపంచయుద్ధ కాలంలో పరిశోధనలు

ధ్వని తరంగాల వేగం గంటకు 1,235 కి.మీ.లు. దీనినే ఒక మ్యాక్‌ అని కూడా పిలుస్తారు. ఒక మ్యాక్‌ను మించిన వేగంతో ప్రయాణించే విమానాలను సూపర్‌ సానిక్‌ విమానాలంటారు. రెండో ప్రపంచయుద్ధ కాలంలో వీటి మీద పరిశోధనలు మొదలయ్యాయి. 1950-60ల నాటికి ఇవి ఉనికిలోకి వచ్చాయి. ప్రధానంగా సైనిక, పరిశోధన అవసరాలకు వీటిని వినియోగించారు. 1968 డిసెంబరు 31వ తేదీన తొలిసారిగా పౌర విమానయాన రంగంలోకి ఓ సూపర్‌ సానిక్‌ విమానం ప్రవేశించింది. దాని పేరు ట్యుపొలెవ్‌ టీయూ-144. దీనిని నాటి సోవియట్‌ యూనియన్‌ తయారు చేసింది. బ్రిటన్‌-ఫ్రాన్స్‌ సంయుక్తంగా రూపొందించిన కాంకార్డ్‌ అనే మరో సూపర్‌ సానిక్‌ విమానం మరుసటి ఏడాది అందుబాటులోకి వచ్చింది. శబ్ద కాలుష్యం, వాతావరణ కాలుష్యం, తయారీకి భారీ వ్యయం, విపరీతంగా ఉండే నిర్వహణ ఖర్చు మొదలైన కారణాలతో పౌరవిమానయాన రంగంలో సూపర్‌ సానిక్‌లు ఎక్కువ కాలంపాటు కొనసాగలేదు. 1978లో ట్యుపొలెవ్‌ టీయూ-144, 2003లో కాంకార్డ్‌ సేవలు నిలిచిపోయాయి. సూపర్‌ సానిక్‌ల సమస్యలను పరిష్కరించి వాటిని పౌర విమానయాన రంగంలోకి తీసుకురావటంపై పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతున్నాయి. కాగా యుద్ధవిమానాలన్నీ సూపర్‌ సానిక్‌ విమానాలే.

Updated Date - Jan 12 , 2024 | 05:42 AM