Share News

‘మోదీ డిగ్రీ’.. ఆప్‌ నేతలపై విచారణ నిలుపుదల

ABN , Publish Date - Jan 17 , 2024 | 03:54 AM

ప్రధాని మోదీ డిగ్రీ వివాదానికి సంబంధించి ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకుల మీద గుజరాత్‌ కోర్టులో జరుగుతున్న విచారణపై మంగళవారం

‘మోదీ డిగ్రీ’.. ఆప్‌ నేతలపై విచారణ నిలుపుదల

న్యూఢిల్లీ, జనవరి 16: ప్రధాని మోదీ డిగ్రీ వివాదానికి సంబంధించి ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకుల మీద గుజరాత్‌ కోర్టులో జరుగుతున్న విచారణపై మంగళవారం సుప్రీంకోర్టు స్టే విధించింది. మోదీ విద్యార్హతలపై తప్పుడు వ్యాఖ్యలు చేశారంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌లపై గుజరాత్‌ వర్సిటీ అహ్మదాబాద్‌ కోర్టులో పరువునష్టం దావా వేసింది. ఆ కోర్టు ఇచ్చిన సమన్లను కొట్టివేయాలని, ఈ కేసును వేరే రాష్ట్రానికి వీలైతే కోల్‌కతాకు బదిలీ చేయాలని కోరుతూ సంజయ్‌ సింగ్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతాల ధర్మాసనం విచారణ జరిపింది. గుజరాత్‌ ట్రయల్‌ కోర్టులో జరుగుతున్న విచారణపై స్టే విధించిన ధర్మాసనం..కేసు బదిలీపై 4 వారాల్లో సమాధానం ఇవ్వాలని గుజరాత్‌ హైకోర్టును ఆదేశించింది.

Updated Date - Jan 17 , 2024 | 03:54 AM