Share News

ఎల్‌ఏసీ వెంట స్వదేశీ యాంటీ డ్రోన్‌ వ్యవస్థ

ABN , Publish Date - Mar 24 , 2024 | 02:35 AM

చైనా సరిహద్దు వెంట భారత సైన్యం అధునాతన యాంటీ డ్రోన్‌ రక్షణ వ్యవస్థను మోహరించింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఏడు ఇంటెగ్రేటెడ్‌ డ్రోన్‌ డిటెక్షన్‌, ఇంటర్‌డిక్షన్‌

ఎల్‌ఏసీ వెంట స్వదేశీ యాంటీ డ్రోన్‌ వ్యవస్థ

న్యూఢిల్లీ, మార్చి 23: చైనా సరిహద్దు వెంట భారత సైన్యం అధునాతన యాంటీ డ్రోన్‌ రక్షణ వ్యవస్థను మోహరించింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఏడు ఇంటెగ్రేటెడ్‌ డ్రోన్‌ డిటెక్షన్‌, ఇంటర్‌డిక్షన్‌ వ్యవస్థల (ఐడీడీ, ఐఎ్‌స)ను చైనాతో ఉత్తర సరిహద్దుల్లో ప్రవేశపెట్టింది. డీఆర్‌డీవో, భారత్‌ ఎలకా్ట్రనిక్స్‌ ఈ వ్యవస్థలను అభివృద్ధి చేశాయి. వాహన ఆధారిత ఈ వ్యవస్థలను మార్క్‌-1 వేరియంట్లుగా పిలుస్తారు. 5 నుంచి 8 కిలో మీటర్ల పరిధి లోపు శత్రు డ్రోన్లను గుర్తించగలవు. తక్కువ రాడార్‌ క్రాస్‌-సెక్షన్‌ డ్రోన్లు లేదా మానవ రహిత వైమానిక వాహనాలను ఈ వ్యవస్థల ద్వారా గుర్తించవచ్చని భారత సైన్యానికి చెందిన అధికారి వెల్లడించారు. సాఫ్ట్‌, హార్డ్‌ కిల్స్‌ ఇంటెగ్రేటెడ్‌ అప్లికేషన్‌ ద్వారా శత్రు డ్రోన్లను విధ్వంసం చేయడానికి ఉపయోగపడతాయని తెలిపారు.

Updated Date - Mar 24 , 2024 | 02:35 AM