భారత బలగాలు వెళ్లాల్సిందే
ABN , Publish Date - Feb 06 , 2024 | 03:37 AM
తమ దేశ సార్వభౌమత్వం విషయంలో రాజీ లేదని, అందులో జోక్యం చేసుకొనేందుకు ఏ దేశాన్ని అనుమతించేది లేదని మాల్దీవులఅధ్యక్షుడు మహమద్ ముయిజ్జు ఆ దేశ పార్లమెంటులో
మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5 : తమ దేశ సార్వభౌమత్వం విషయంలో రాజీ లేదని, అందులో జోక్యం చేసుకొనేందుకు ఏ దేశాన్ని అనుమతించేది లేదని మాల్దీవులఅధ్యక్షుడు మహమద్ ముయిజ్జు ఆ దేశ పార్లమెంటులో సోమవారం స్పష్టం చేశారు. ఇప్పటికే రెండు దేశాలు.. భారత బలగాలు మే 10నాటికి మాల్దీవులను వీడేందుకు అంగీకారానికి వచ్చాయని చెప్పారు. ఈ విషయంలో భారత్‌తో ఒప్పందాన్ని పునరుద్ధరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మయిజ్జు ప్రసంగాన్ని అక్కడి ప్రధాన ప్రతిపక్షాలయిన ఎండీపీ, డెమొక్రాట్స్... రెండూ బహిష్కరించాయి. కాగా, 87 మంది భారత సైనికులు మాత్రమే ఆ దేశంలో ఉన్నారు. మానవతా సాయం, అత్యవసర వైద్య చికిత్సకు బాధితుల తరలింపులో సహకరించడమే వీరి పని. మయిజ్జు అధ్యక్షుడు అయినప్పటి నుంచి భారత బలగాలను పంపించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు.