భారత సైన్యం భేష్!
ABN , Publish Date - Jan 18 , 2024 | 03:03 AM
ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన సాయుధ దళం కలిగిన దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. సైనిక శక్తిని వెల్లడించే ‘గ్లోబల్ ఫైర్‌పవర్’ సంస్థ ప్రపంచ దేశాల మిలటరీకి సంబంధించిన తాజా ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది.
న్యూఢిల్లీ, జనవరి 17: ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన సాయుధ దళం కలిగిన దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. సైనిక శక్తిని వెల్లడించే ‘గ్లోబల్ ఫైర్‌పవర్’ సంస్థ ప్రపంచ దేశాల మిలటరీకి సంబంధించిన తాజా ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఈ జాబితాలో అగ్రరాజ్యం అమెరికా టాప్‌లో కొనసాగుతుండగా.. రష్యా, చైనా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. భారత్ నాలుగో స్థానంలోనూ, దక్షిణ కొరియా ఐదో స్థానంలోనూ ఉన్నాయి. గతేడాది ఐదో స్థానంలో ఉన్న బ్రిటన్ ఒక స్థానం దిగజారి ఆరో స్థానానికి పరిమితమైంది. గ్లోబల్ ఫైర్‌పవర్.. ప్రపంచవ్యాప్తంగా 145 దేశాల సైనిక బలం ఆధారంగా ఈ ర్యాంకింగ్స్ ఇచ్చింది. దళాల సంఖ్య, యుద్ధ పరికరాలు, ఆర్థిక స్థిరత్వం, భౌగోళిక పరిస్థితుల్లాంటి 60కిపైగా అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకులను ఇచ్చింది.