Share News

వారంలో దేశవ్యాప్తంగా సీఏఏ అమలు

ABN , Publish Date - Jan 30 , 2024 | 02:54 AM

వారం రోజుల్లో దేశవ్యాప్తంగా సీఏఏ(పౌరసత్వ సవరణ చట్టం)ను అమలు చేస్తామని కేంద్ర మంత్రి శంతను ఠాకూర్‌ ప్రకటించారు. సోమవారం కోల్‌కతాలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏడు రోజుల్లో సీఏఏ అమలు చేస్తామనేది తన

వారంలో దేశవ్యాప్తంగా సీఏఏ అమలు

కేంద్ర మంత్రి శంతను ఠాకూర్‌ వెల్లడి

కోల్‌కతా, జనవరి 29: వారం రోజుల్లో దేశవ్యాప్తంగా సీఏఏ(పౌరసత్వ సవరణ చట్టం)ను అమలు చేస్తామని కేంద్ర మంత్రి శంతను ఠాకూర్‌ ప్రకటించారు. సోమవారం కోల్‌కతాలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏడు రోజుల్లో సీఏఏ అమలు చేస్తామనేది తన గ్యారెంటీ అని నొక్కి చెప్పారు. ఆదివారం కూడా పశ్చిమబెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లా కాక్‌ద్వీ్‌పలో నిర్వహించిన బహిరంగ సభలో శాంతను ఠాకూర్‌ మాట్లాడుతూ ‘మీకు ఓటరు, ఆధార్‌కార్డులు ఉన్నట్లైతే మీరు ఈ దేశ పౌరులే అని, మీరు ఓటు వేయొచ్చని ఈ రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అదే నిజమైతే ఇక్కడ వేలమంది ఎందుకు ఓటుహక్కు కోల్పోయారో ముఖ్యమంత్రి(మమతా బెనర్జీ) సమాధానం చెప్పాలి? భవిష్యత్తు తరాల భద్రత కోసం సీఏఏను అమలు చేస్తున్నాం’ అన్నారు. అయితే, ఇది ఎన్నికల నేపథ్యంలో చేసిన ప్రకటన అని, పశ్చిమబెంగాల్‌లో సీఏఏ అమలును అడ్డుకుంటామని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. ‘లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ సీఏఏ అంశాన్ని లేవనెత్తుతోంది. ఇది ఎన్నికల దృష్ట్యా చేసిన ప్రకటనే’ అని ఆ పార్టీ అధికార ప్రతినిధి కునాల్‌ ఘోష్‌ కొట్టిపారేశారు. ‘ఎప్పటిలాగే బీజేపీ సీఏఏ ద్వారా పాత ఎత్తుగడలనే ఉపయోగిస్తోంది. రాష్ట్రంలో సీఏఏను అమలు చేయబోమని మా పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ స్పష్టంగా చెప్పారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే బీజేపీ సీఏఏ అంశాన్ని లేవనెత్తుతోందని కూచ్‌బెహార్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మమత నిందించారు.

Updated Date - Jan 30 , 2024 | 07:39 AM