Share News

CM MK Stalin : నా ఎత్తు ఎంతో నాకు తెలుసు..!

ABN , Publish Date - Jun 06 , 2024 | 05:41 AM

సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి స్పష్టమైన ఆధిక్యం లభించినప్పటికీ.. ఊహించని పరిణామాలు ఎదురైతే ఇండియా కూటమి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే ప్రధాని మంత్రి ఎవరు..? అనే చర్చ కూడా నడుస్తోంది. దీని గురించి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే

CM MK Stalin : నా ఎత్తు ఎంతో నాకు తెలుసు..!

కూటమి ప్రధాని అభ్యర్థి రేసుపై స్టాలిన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

చెన్నై, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి స్పష్టమైన ఆధిక్యం లభించినప్పటికీ.. ఊహించని పరిణామాలు ఎదురైతే ఇండియా కూటమి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే ప్రధాని మంత్రి ఎవరు..? అనే చర్చ కూడా నడుస్తోంది. దీని గురించి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను ప్రశ్నించగా ఆయన ‘నా ఎత్తు ఎంతో నాకు తెలుసు’ అంటూ ఆసక్తికర సమాధానమిచ్చారు. ఢిల్లీలో ‘ఇండియా’ కూటమి సమావేశంలో పాల్గొనేందుకు బుధవారం ఉదయం చెన్నై విమానాశ్రయానికి వచ్చిన స్టాలిన్‌ను ‘ఒకవేళ ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. మిమ్మల్ని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించే అవకాశముందా..?’ అని మీడియా ప్రశ్నించగా.. ‘నా ఎత్తు ఎంతో నాకు తెలుసు..’ అంటూ ఆయన బదులిచ్చారు. దివంగత కరుణానిధిని కూడా ఎవరైనా ఇలాగే అతిశయోక్తులతో ప్రశంసిస్తే.. ‘నా ఎత్తు నాకు తెలుసు’ అంటూ సున్నితంగా తోసిపుచ్చేవారు. ఇప్పుడు స్టాలిన్‌ కూడా తన తండ్రిలాగే వ్యాఖ్యానించడంతో మీడియా ప్రతినిధులు ఆశ్చర్యపోయారు.

Updated Date - Jun 06 , 2024 | 05:41 AM