Share News

మూల వేతనంలో 50% పింఛను!

ABN , Publish Date - Jun 12 , 2024 | 04:24 AM

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం.. ఉద్యోగులకు భారీ ఆఫర్‌ ప్రకటించనుంది. జాతీయ పింఛను పథకం(ఎన్‌పీఎ్‌స)లో భాగంగా ఉద్యోగుల చిట్ట చివరి మూల వేతనం(బేసిక్‌ పే)లో 50ు పింఛనుగా ఖచ్చితంగా ఇవ్వాలని

మూల వేతనంలో 50% పింఛను!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్డీయే సర్కారు భారీ ఆఫర్‌

కమిటీ సిఫారసులపై దృష్టి

అమలుకు గడువు పెట్టని కమిటీ

న్యూఢిల్లీ, జూన్‌ 11: కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం.. ఉద్యోగులకు భారీ ఆఫర్‌ ప్రకటించనుంది. జాతీయ పింఛను పథకం(ఎన్‌పీఎ్‌స)లో భాగంగా ఉద్యోగుల చిట్ట చివరి మూల వేతనం(బేసిక్‌ పే)లో 50% పింఛనుగా ఖచ్చితంగా ఇవ్వాలని ప్రతిపాదించింది. ఎన్‌పీఎ్‌సపై అభ్యంతరాలు, పలు రాష్ట్రాలు తిరిగి పాత పింఛను విధానం వైపు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్‌ నేతృత్వంలో 2023లో కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఎన్‌పీఎ్‌సను మరింత ప్రయోజనకరంగా మార్చేందుకు అనుసరించాల్సిన విధానాలపై ఈ కమిటీ అధ్యయనం చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వం.. ఉద్యోగులకు చిట్ట చివరి మూల వేతనంలో 50ు మొత్తాన్ని పింఛనుగా ఇచ్చేందుకు ప్రతిపాదించింది. ఎన్‌పీఎ్‌సలో మార్పులు చేయాలని కూడా సోమనాథన్‌ కమిటీ సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం తాజా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే.. కమిటీ తన సిఫారసులను అమలు చేసేందుకు ఎలాంటి నిర్దిష్ఠ గడువు విధించలేదు.

Updated Date - Jun 12 , 2024 | 04:24 AM