ఝార్ఖండ్ సీఎంగా హేమంత్ ప్రమాణం
ABN , Publish Date - Jul 05 , 2024 | 01:12 AM
జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్ (48) గురువారం ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా మళ్లీ ప్రమాణ స్వీకారం చేశారు.

రాంచీ, జూలై 4: జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్ (48) గురువారం ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా మళ్లీ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో హేమంత్ సోరెన్ చేత గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేయించారు. హేమంత్ సోరెన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది మూడోసారి. ఈ కార్యక్రమంలో సోరెన్ తండ్రి, ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) చీఫ్ శిబూ సోరెన్, ఆయన తల్లి రుపి సోరెన్, భార్య కల్పనా సోరెన్‌తోపాటు జేఎంఎం నేతృత్వంలోని కూటమి సీనియర్ నేతలు, బుధవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన చంపయి సోరెన్ కూడా పాల్గొన్నారు. భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఝార్ఖండ్ హైకోర్టు జూన్ 28న బెయిల్ మంజూరు చేయడంతో దాదాపు ఐదు నెలల తర్వాత హేమంత్ సోరెన్ జైలు నుంచి విడుదలయ్యారు. కాగా ప్రతిపక్షాలు తనపై కుట్రపన్నాయని, ఫలితంగా తాను దాదాపు ఐదు నెలల పాటు జైల్లో ఉండాల్సి వచ్చిందని హేమంత్ వీడియో సందేశంలో తెలిపారు. కాగా హేమంత్ సోరెన్ క్యాబినెట్‌కు సంబంధించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.