Share News

దివ్యాంగులకు సాయం కోసం హెల్ప్‌లైన్‌

ABN , Publish Date - Jan 09 , 2024 | 04:25 AM

Helpline for the disabled

దివ్యాంగులకు సాయం కోసం హెల్ప్‌లైన్‌

గోవా, జనవరి 8: దివ్యాంగులకు ఏ సమయంలోనైనా ఎలాంటి సాయమైనా అందించేందుకు తొలిసారిగా జాతీయ స్థాయి హెల్ప్‌లైన్‌ సోమవారం ఇక్కడ ప్రారంభమయింది. టోల్‌ ఫ్రీ నెంబరైన 1800 22 2014కు ఫోన్‌ చేసి తమ సమస్యను వివరించి సాయం కోరవచ్చు. ఇది 24/7 విధానంలో పని చేస్తుంది. ఇక్కడ నిర్వహిస్తున్న పర్పుల్‌ ఫెస్టివల్‌ ఇంటర్నేషనల్‌లో కేంద్ర సామాజిక న్యాయం శాఖ సహాయ మంత్రి రామదాస్‌ అఠావలే, వికాలంగుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రాజేష్‌ అగర్వాల్‌లు ప్రారంభించారు. 21 అంగవైకల్యాల్లోని 153 కేటగిరీలకు సంబంధించి ఎలాంటి సమాచారం కావాల్సి వచ్చినా అందజేస్తారు. విద్య, ఉపాధి, శిక్షణ సహా ఇతర సమాచారాన్ని ఈ నెంబరుకు ఫోన్‌ చేసి పొందవచ్చు.

Updated Date - Jan 09 , 2024 | 06:58 AM