యూపీ ఉపఎన్నికల్లో పోటీ చేయట్లేదు
ABN , Publish Date - Oct 25 , 2024 | 01:11 AM
వచ్చే నెల 13న ఉత్తరప్రదేశ్‌లో 9 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఉపఎన్నికల్లో పోటీ చేయట్లేదని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ‘ఇండియా’ కూటమి

‘ఇండియా’ అభ్యర్థుల్ని బలపరుస్తాం: కాంగ్రెస్
న్యూఢిల్లీ, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): వచ్చే నెల 13న ఉత్తరప్రదేశ్‌లో 9 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఉపఎన్నికల్లో పోటీ చేయట్లేదని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ‘ఇండియా’ కూటమి అభ్యర్థులకు మద్దతిస్తామని వెల్లడించింది. ఈ మేరకు గురువారం ఢిల్లీలోని పార్టీ హెడ్ క్వార్టర్స్‌లో కాంగ్రెస్ యూపీ చీఫ్ అజయ్ రాయ్‌తో కలిసి పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్ ప్రధాన కార్యదర్శి అవినాష్ పాండే మీడియాతో మాట్లాడారు. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నాయకత్వంతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని అవినాష్ పాండే తెలిపారు. మరోవైపు ‘ఇండియా’ అభ్యర్థులంతా తమ పార్టీ గుర్తు సైకిల్ పైనే బరిలో నిలుస్తారని ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు. కాంగ్రెస్, ఎస్పీలు ఐక్యంగా ఉన్నాయన్నారు.