Share News

పతనం అంచున హమాస్‌

ABN , Publish Date - Feb 20 , 2024 | 05:54 AM

‘‘హమా్‌సను నామరూపాల్లేకుండా చేస్తాం..! ప్రతి హమాస్‌ ఉగ్రవాదిని వేటాడి చంపేస్తాం..!!’’ గత ఏడాది అక్టోబరు 7న హమాస్‌ దాడి తర్వాత ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు చేసిన శపథం ఇది..!

పతనం అంచున హమాస్‌

ఇప్పటికే కీలక కమాండర్ల మృతి

లొంగు‘బాట’లో చాలా మంది ఫైటర్లు

ఇజ్రాయెల్‌ శపథం నెరవేరుతోందా?

‘‘హమా్‌సను నామరూపాల్లేకుండా చేస్తాం..! ప్రతి హమాస్‌ ఉగ్రవాదిని వేటాడి చంపేస్తాం..!!’’ గత ఏడాది అక్టోబరు 7న హమాస్‌ దాడి తర్వాత ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు చేసిన శపథం ఇది..! గాజాపై అక్టోబరు 28 నుంచి భూతల దాడులు ప్రారంభించిన ఇజ్రాయెల్‌.. మధ్యలో సంధికాలంలో(ఆరు రోజులు) తప్ప.. 115 రోజులుగా నిరాటంకంగా పోరాటం చేస్తూనే ఉంది. ఓ క్రమ పద్ధతిలో హమాస్‌ అగ్రనేతలను మట్టుబెడుతూ వస్తోంది. ముఖ్యంగా అక్టోబరు 7న హమాస్‌ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై దాడి చేశాక.. ఆ దృశ్యాలను లైవ్‌లో చూస్తూ.. ‘థాంక్స్‌ గీవింగ్‌’ ప్రార్థనలు చేసిన ముఖ్య నాయకులను తొలుత టార్గెట్‌గా చేసుకుంది. ఈ క్రమంలో హమాస్‌ పొలిటికల్‌ బ్యూరో సభ్యులు జకారియా అబూ ముమ్మార్‌, ఎలైట్‌ ఫోర్స్‌ కమాండర్‌ అలీ అల్‌ ఖాదీ, హమాస్‌ ఆర్థిక విభాగం నేత జవాద్‌ అబూ షమ్మలా తదితర కీలక హమాస్‌ నేతలను ఐడీఎఫ్‌ తుదముట్టించింది. గత నెల లెబనాన్‌లో ఉన్న హమాస్‌ నేత సలేహ్‌ అల్‌-అరౌరీని హతమార్చడంతో హమాస్‌ పూర్తిగా బలహీనపడ్డట్లయింది. దీంతో మిగిలిన హమాస్‌ కమాండర్లు ఐడీఎఫ్‌కు లొంగిపోతున్నారు.

పంటికింద రాయిలా.. ఆ ఐదుగురు!

ఇప్పటి దాకా ఇజ్రాయెల్‌ కీలక హమాస్‌ కమాండర్లను తుదముట్టించినా.. పలు బ్రిగేడ్‌ల నాయకులు లొంగిపోయినా.. ఓ ఐదుగురు మాత్రం పంటికిద రాయిలా మిగిలిపోయారు. వారిలో తొలి స్థానంలో ఇస్మాయిల్‌ హనియే ఉన్నారు. ఈయన 2017 నుంచి హమాస్‌ పొలిటికల్‌ బ్యూరో అధిపతిగా కొనసాగుతున్నారు. గతంలో గాజాస్ట్రి్‌పను హమాస్‌ స్వాధీనం చేసుకోవడంలో, అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై దాడిలో ఇతను కీలక సూత్రధారి. ఆయన తర్వాతి స్థానంలో ఖలీద్‌ మెషాల్‌ ఉన్నారు. ఇక హమాస్‌ సైనిక విభాగం-పొలిటికల్‌ బ్యూరో మధ్య సంధానకర్తగా పనిచేస్తున్న ఫాతిమా హమాద్‌ ఇప్పుడు తుర్కియేలో తలదాచుకుంటున్నారు. ఇజ్రాయెల్‌పై దాడిలో కీలకంగా వ్యవహరించిన యాహ్యా సిన్వార్‌ కూడా ఇజ్రాయెల్‌కు చిక్కడు-దొరకడు అన్నట్లుగా తప్పించుకు తిరుగుతున్నాడు. ఇతని వ్యూహాలు అత్యంత క్రూరంగా ఉంటాయి. ఇక ఇజ్రాయెల్‌కు దొరకకుండా ముప్పుతిప్పలు పెడుతున్న మూసా అబూ మర్జౌక్‌ జోర్దాన్‌లో ఉన్నారు. ప్రవాసం నుంచే ఇతను పొలిటికల్‌ బ్యూరో సీనియర్‌ సభ్యుడిగా పనిచేస్తున్నారు. హమాస్‌ అగ్రనేత అల్‌-ఖాసం మహమ్మద్‌ అల్‌-డైఫ్‌ కూడా ఇజ్రాయెల్‌కు మింగుడుపడడం లేదు.

- సెంట్రల్‌ డెస్క్‌

లెబనాన్‌లోనూ టన్నెల్స్‌ నెట్‌వర్క్‌

గాజాలో హమాస్‌ సొరంగాల నెట్‌వర్క్‌ మాదిరిగానే.. దక్షిణ లెబనాన్‌లో హిజ్బుల్లా కిలోమీటర్ల మేర టన్నెల్స్‌తో భూగర్భంలో తలదాచుకునేలా భారీ వ్యవస్థను ఏర్పాటు చేసింది. హిజ్బుల్లా ఉగ్రవాదులు కొన్నేళ్ల క్రితమే ఈ సొరంగాలను నిర్మించినట్లు ఫ్రెంచ్‌ మిలటరీ స్కూల్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ స్ట్రాటజిక్‌ రిసెర్చ్‌ వెల్లడించింది. గాజాలోని ఇసుక నేలల్లో సొరంగాలుండగా.. హిజ్బుల్లా టన్నెల్స్‌ మాత్రం కొండలను తొలిచి నిర్మించినట్లు వివరించింది.

Updated Date - Feb 20 , 2024 | 05:54 AM