Share News

కాంగ్రెస్‌కు అశోక్‌ చవాన్‌ గుడ్‌ బై

ABN , Publish Date - Feb 13 , 2024 | 04:52 AM

సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రె్‌సకు గట్టి షాక్‌ తగిలింది. మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్‌ చవాన్‌ సోమవారం ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆయన భాజపాలో చేరే అవకాశం ఉందని సమాచారం.

కాంగ్రెస్‌కు అశోక్‌ చవాన్‌ గుడ్‌ బై

ముంబై, ఫిబ్రవరి 12: సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రె్‌సకు గట్టి షాక్‌ తగిలింది. మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్‌ చవాన్‌ సోమవారం ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆయన భాజపాలో చేరే అవకాశం ఉందని సమాచారం. రాజీనామా తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటి దాకా కాంగ్రెస్‌ కోసం నిజాయితీగా పనిచేశానని, వ్యక్తిగత కారణాల వల్ల పార్టీని వీడుతున్నానని తెలిపారు. ఆయన 2008 నుంచి 2010 వరకు సీఎంగా పనిచేశారు. ‘ఆదర్శ్‌ హౌసింగ్‌ సొసైటీ స్కాం’లో ఆయన పాత్ర ఉందన్న ఆరోపణలతో సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. భవిష్యత్తు కార్యాచరణపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని చవాన్‌ చెప్పారు. ఈ విషయంపై బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్‌ మాట్లాడుతూ కాంగ్రె్‌సలోని పలువురు మంచి నాయకులు బీజేపీతో టచ్‌లో ఉన్నారన్నారు. కాగా, అశోక్‌ చవాన్‌ నమ్మకద్రోహి అని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ విమర్శించారు. నిన్నటి వరకు సీట్ల పంపకంపై చర్చల్లో పాల్గొన్న చవాన్‌ కాంగ్రె్‌సను వీడడం ఆశ్చర్యం కలిగిస్తోందని ఉద్ధవ్‌ ఠాక్రే పేర్కొన్నారు.

Updated Date - Feb 13 , 2024 | 04:52 AM