Share News

నేవీ మహిళా పైలట్‌కు తొలిసారిగా ‘గోల్డెన్‌ వింగ్స్‌’

ABN , Publish Date - Jun 09 , 2024 | 05:49 AM

భారత నౌకాదళంలో పనిచేస్తున్న మహిళా పైలట్‌కు తొలిసారిగా గోల్డెన్‌ వింగ్స్‌ పతకం లభించింది. హెలికాప్టర్‌ పైలట్‌గా శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన సబ్‌ లెఫ్టినెంట్‌ అనామిక బి రాజీవ్‌కు ఈ గౌరవం

నేవీ మహిళా పైలట్‌కు తొలిసారిగా ‘గోల్డెన్‌ వింగ్స్‌’

న్యూఢిల్లీ, జూన్‌ 8: భారత నౌకాదళంలో పనిచేస్తున్న మహిళా పైలట్‌కు తొలిసారిగా గోల్డెన్‌ వింగ్స్‌ పతకం లభించింది. హెలికాప్టర్‌ పైలట్‌గా శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన సబ్‌ లెఫ్టినెంట్‌ అనామిక బి రాజీవ్‌కు ఈ గౌరవం దక్కింది. తమిళనాడులోని అరక్కోణంలో ఉన్న నేవల్‌ ఎయిర్‌ బేస్‌ స్టేషన్‌లో శనివారం జరిగిన పాసింగ్‌ అవుట్‌ పెరేడ్‌లో ఈస్ట్రన్‌ నావల్‌ కమాండ్‌ ఫ్లాగ్‌ ఆఫీసర్‌, కమాండింగ్‌ ఇన్‌ చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ రాజేష్‌ పెంధార్‌కర్‌ దీన్ని అందజేశారు. శిక్షణ పూర్తి చేస్తున్న 21 మందికి ఈ అవార్డులు దక్కాయి. ఆమెతో పాటు జమ్‌యాంగ్‌ త్సెవాంగ్‌ మరో రికార్డు సృష్టించారు. ఆయన లద్దాఖ్‌ నుంచి ఎంపికయిన తొలి నేవీ కమిషన్డ్‌ ఆఫీసర్‌ కావడం విశేషం. 22 వారాల శిక్షణలో ప్రతిభ చూపించిన వారికి ఈ పతకాలు బహూకరించారు.

Updated Date - Jun 09 , 2024 | 05:49 AM