Share News

గుల్జార్‌, రామభద్రాచార్యకు జ్ఞానపీఠ్‌

ABN , Publish Date - Feb 18 , 2024 | 04:31 AM

ప్రసిద్ద ఉర్దూ కవి, పాటల రచయిత గుల్జార్‌, సంస్కృత పండితుడు, చిత్రకూట్‌లోని తులసీపీఠ్‌ వ్యవస్థాపకుడు జగద్గురు రామభద్రాచార్య 2023 సంవత్సరానికి జ్ఞానపీఠ్‌ పురస్కారానికి ఎంపికయ్యారు.

గుల్జార్‌, రామభద్రాచార్యకు జ్ఞానపీఠ్‌

ఉర్దూ, సంస్కృత సాహితీవేత్తలకు పురస్కారం

2023 ఏడాదికి ప్రకటించిన ఎంపిక కమిటీ

జ్యూరీలో ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి, కవి కృష్ణారావు

పసితనంలోనే కంటిచూపు కోల్పోయినా

సాహితీ రంగంలో రామభద్రాచార్య అసాధారణ కృషి

ఉర్దూ సాహితీ జగత్తులో గుల్జార్‌ ధృవతార

బాలీవుడ్‌లో అనేక సూపర్‌హిట్‌ పాటలు ఆయన రాసినవే

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): ప్రసిద్ద ఉర్దూ కవి, పాటల రచయిత గుల్జార్‌, సంస్కృత పండితుడు, చిత్రకూట్‌లోని తులసీపీఠ్‌ వ్యవస్థాపకుడు జగద్గురు రామభద్రాచార్య 2023 సంవత్సరానికి జ్ఞానపీఠ్‌ పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రముఖ ఒడియా రచయిత్రి, జ్ఞానపీఠ్‌ పురస్కార గ్రహీత ప్రతిభా రే అధ్యక్షతన 11 మంది సాహితీవేత్తలతో కూడిన ఎంపిక కమిటీ ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకొని శనివారం ప్రకటించింది. గుల్జార్‌, రామభద్రాచార్య.. తమ తమ రంగాల్లో అసాధారణమైన సాహితీ సేవ చేశారని ఎంపిక కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ‘సినీరంగంలో సుదీర్ఘ ప్రయాణంతోపాటు, కవిత్వంలో మూడు లైన్లతో కూడిన త్రివేణి అనే కొత్త రూపాన్ని గుల్జార్‌ సృష్టించారు’ అని పేర్కొంది.

శ్రోతలకు వీనులవిందు ఆయన పాటలు

గుల్జార్‌ అసలు పేరు సంపూరణ్‌ సింగ్‌ కల్రా. ఆయన వయసు 89 ఏళ్లు. సమకాలీన చరిత్రలో అత్యుత్తమ ఉర్దూ కవుల్లో ఆయన ఒకరు. హిందీ సినిమాల్లో ఆయన రాసిన పాటలు అనేకం విశేష ఆదరణ పొందాయి. పంజాబీతోపాటు పలు ఇతర భాషల్లోనూ ఆయన రచనలు చేశారు. 2002లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, 2004లో పద్మభూషణ్‌, 2013లో దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారాలు ఆయనకు లభించాయి. కనీసం ఐదు జాతీయ ఫిల్మ్‌ అవార్డులు గుల్జార్‌ రచనలకు దక్కాయి. 2009లో ఆస్కార్‌ పురస్కారం పొందిన స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌ సినిమాలో జై హో అనే పాట గుల్జార్‌ కలం నుంచి జాలు వారిందే. కాగా, 1944లో జ్ఞానపీఠ్‌ పురస్కారాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది ప్రకటించినది 58వ పురస్కారం. అవార్డు కింద గ్రహీతకు రూ.21 లక్షల నగదు, వాగ్దేవి విగ్రహం, సన్మానపత్రం అందజేస్తారు. సంస్కృత భాషకు జ్ఞానపీఠ్‌ లభించటం రెండోసారి కాగా, ఉర్దూకు ఇది ఐదోసారి.

గంటలో 100 సంస్కృత పద్యాలు

రామానంద సంప్రదాయానికి చెందిన నలుగురు జగద్గురు రామానందచార్యులలో రామభద్రాచార్య ఒకరు. 1982 నుంచి ఆయన జగద్గురుగా ఉన్నారు. ఆయన అసలు పేరు గిరిధర్‌ మిశ్రా. వయసు 74 ఏళ్లు. రెండు నెలల పసితనంలోనే అనారోగ్యంతో కంటి చూపు కోల్పోయినప్పటికీ సంస్కృతంలో అపారమైన పాండిత్యం సంపాదించారు. ఆయన 22 భాషల్లో మాట్లాడగలరు. సంస్కృతంతోపాటు హిందీ, అవధ్‌, మైథిలీ తదితర భాషల్లో అనేక కవితలు, రచనలు చేశారు. రామభద్రాచార్య గంటకు 100కు పైగా సంస్కృత పద్యాలను రచించగలరని, ప్రస్తుత కాలంలో సంస్కృత పాండిత్యానికి సంబంధించి ఆయనకు దరిదాపుల్లో ఎవరూ లేరని జ్ఞానపీఠ్‌ కోసం ఆయన పేరు ప్రతిపాదించిన న్యాయనిర్ణేతలు భావించారు. న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): ప్రసిద్ద ఉర్దూ కవి, పాటల రచయిత గుల్జార్‌, సంస్కృత పండితుడు, చిత్రకూట్‌లోని తులసీపీఠ్‌ వ్యవస్థాపకుడు జగద్గురు రామభద్రాచార్య 2023 సంవత్సరానికి జ్ఞానపీఠ్‌ పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రముఖ ఒడియా రచయిత్రి, జ్ఞానపీఠ్‌ పురస్కార గ్రహీత ప్రతిభా రే అధ్యక్షతన 11 మంది సాహితీవేత్తలతో కూడిన ఎంపిక కమిటీ ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకొని శనివారం ప్రకటించింది. గుల్జార్‌, రామభద్రాచార్య.. తమ తమ రంగాల్లో అసాధారణమైన సాహితీ సేవ చేశారని ఎంపిక కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ‘సినీరంగంలో సుదీర్ఘ ప్రయాణంతోపాటు, కవిత్వంలో మూడు లైన్లతో కూడిన త్రివేణి అనే కొత్త రూపాన్ని గుల్జార్‌ సృష్టించారు’ అని పేర్కొంది.

శ్రోతలకు వీనులవిందు ఆయన పాటలు

గుల్జార్‌ అసలు పేరు సంపూరణ్‌ సింగ్‌ కల్రా. ఆయన వయసు 89 ఏళ్లు. సమకాలీన చరిత్రలో అత్యుత్తమ ఉర్దూ కవుల్లో ఆయన ఒకరు. హిందీ సినిమాల్లో ఆయన రాసిన పాటలు అనేకం విశేష ఆదరణ పొందాయి. పంజాబీతోపాటు పలు ఇతర భాషల్లోనూ ఆయన రచనలు చేశారు. 2002లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, 2004లో పద్మభూషణ్‌, 2013లో దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారాలు ఆయనకు లభించాయి. కనీసం ఐదు జాతీయ ఫిల్మ్‌ అవార్డులు గుల్జార్‌ రచనలకు దక్కాయి. 2009లో ఆస్కార్‌ పురస్కారం పొందిన స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌ సినిమాలో జై హో అనే పాట గుల్జార్‌ కలం నుంచి జాలు వారిందే. కాగా, 1944లో జ్ఞానపీఠ్‌ పురస్కారాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది ప్రకటించినది 58వ పురస్కారం. అవార్డు కింద గ్రహీతకు రూ.21 లక్షల నగదు, వాగ్దేవి విగ్రహం, సన్మానపత్రం అందజేస్తారు. సంస్కృత భాషకు జ్ఞానపీఠ్‌ లభించటం రెండోసారి కాగా, ఉర్దూకు ఇది ఐదోసారి.

గంటలో 100 సంస్కృత పద్యాలు

రామానంద సంప్రదాయానికి చెందిన నలుగురు జగద్గురు రామానందచార్యులలో రామభద్రాచార్య ఒకరు. 1982 నుంచి ఆయన జగద్గురుగా ఉన్నారు. ఆయన అసలు పేరు గిరిధర్‌ మిశ్రా. వయసు 74 ఏళ్లు. రెండు నెలల పసితనంలోనే అనారోగ్యంతో కంటి చూపు కోల్పోయినప్పటికీ సంస్కృతంలో అపారమైన పాండిత్యం సంపాదించారు. ఆయన 22 భాషల్లో మాట్లాడగలరు. సంస్కృతంతోపాటు హిందీ, అవధ్‌, మైథిలీ తదితర భాషల్లో అనేక కవితలు, రచనలు చేశారు. రామభద్రాచార్య గంటకు 100కు పైగా సంస్కృత పద్యాలను రచించగలరని, ప్రస్తుత కాలంలో సంస్కృత పాండిత్యానికి సంబంధించి ఆయనకు దరిదాపుల్లో ఎవరూ లేరని జ్ఞానపీఠ్‌ కోసం ఆయన పేరు ప్రతిపాదించిన న్యాయనిర్ణేతలు భావించారు.

జ్యూరీలో ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి, కవి కృష్ణారావు

జ్ఞానపీఠ్‌ జ్యూరీలో ప్రతిభా రేతోపాటు కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు మాధవ్‌ కౌశిక్‌, కొంకణి రచయిత దామోదర్‌ మౌజో, బెంగాలీ రచయిత సురంజన్‌ దాస్‌, కన్నడ రచయిత పురుషోత్తమ్‌ బిలిమలే, మరాఠీ కవి ప్రఫుల్‌ షిలేదార్‌, మలయాళీ రచయిత ప్రభావర్మ, హిందీ ర చయితలు హరీశ్‌ త్రివేది, మధుసూధన్‌ ఆనంద్‌, జానకీ ప్రసాద్‌ శర్మతో పాటు తెలుగు కవి, ఆంధ్రజ్యోతి ఢిల్లీ బ్యూరో ఛీఫ్‌ ఎ.కృష్ణారావు ఉన్నారు.

Updated Date - Feb 18 , 2024 | 04:32 AM