Share News

డిసెంబరులో 6 ప్రమాదాలు.. 236 మంది మృతి

ABN , Publish Date - Dec 30 , 2024 | 04:08 AM

ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం వల్ల ప్రయాణికుల విమానాలు ప్రమాదాలకు గురవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

డిసెంబరులో 6 ప్రమాదాలు.. 236 మంది మృతి

ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం వల్ల ప్రయాణికుల విమానాలు ప్రమాదాలకు గురవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ నెల 25న అజర్‌బైజాన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కజకిస్థాన్‌లో కూలిపోవడంతో 38 మంది చనిపోయారు. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలోనే అజర్‌బైజాన్‌ విమానం కూలింది. ఈ ఏడాది జనవరిలో రష్యా మిలిటరీ విమానం కూలి 74 మంది మరణించారు. ఉక్రెయన్‌ దళాలే తమ విమానాన్ని కూల్చివేసినట్లు రష్యా ఆరోపించింది. మరోవైపు డిసెంబరు నెల విమాన ప్రయాణికులకు పీడకలగా మిగిలిపోనుంది. ఈ నెలలోనే 6 విమానాలు కూలిపోయాయి. 236 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదివా రం జెజు విమానం కూలిన ఘటనలో 179 మంది మరణించారు. ఈ నెల 22న బ్రెజిల్‌లో విమానం కూ లి 10 మంది మరణించారు. అదేరోజు పపువా న్యూగినియాలో విమానం కూలి ఐదుగురు చని పోయారు. అర్జంటీనాలో ఈ నెల 18న విమానం కూ లి ఇద్దరు పైలట్లు మరణించారు. హవాయిలో ఈ నెల 17న విమానం కూలి ఇద్దరు పైలట్లు చనిపోయారు.

Updated Date - Dec 30 , 2024 | 04:08 AM