ట్రాన్స్‌జెండర్లకు 1% రిజర్వేషన్లు ఇవ్వండి
ABN , Publish Date - Jun 17 , 2024 | 05:48 AM
ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్‌జెండర్లకు ఒక శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. ట్రాన్స్‌జెండర్లను కూడా అందరితో సమానంగా చూస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా ఇంతవరకు రిజర్వేషన్లు కల్పించని విషయా

బెంగాల్ సర్కారుకు హైకోర్టు ఆదేశం
కోల్‌కతా, జూన్ 16: ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్‌జెండర్లకు ఒక శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. ట్రాన్స్‌జెండర్లను కూడా అందరితో సమానంగా చూస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా ఇంతవరకు రిజర్వేషన్లు కల్పించని విషయాన్ని గుర్తుచేసింది. అందువల్ల ఒక శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని న్యాయమూర్తి జస్టిస్ రాజశేఖర్ మంథా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. 2014, 2022ల్లో రెండు సార్లు టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)లో అర్హత సాధించినా తనను ఇంటర్వ్యూకు పిలవలేదని పేర్కొంటూ ఓ ట్రాన్స్‌జెండర్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి ఈ ఆదేశాలు ఇచ్చారు. ట్రాన్స్‌జెండర్లకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించిన విషయాన్ని కూడా గుర్తు చేశారు.