Share News

Delhi: మాల్‌.. ఢమాల్‌

ABN , Publish Date - May 09 , 2024 | 04:46 AM

దేశంలోని మెట్రో నగరాల్లో ఘోస్ట్‌ మాల్స్‌ అధికమవుతున్నాయి.

Delhi: మాల్‌.. ఢమాల్‌

  • దేశంలోని నగరాల్లో పెరుగుతున్న ఘోస్ట్‌ మాల్స్‌

  • ఆన్‌లైన్‌ షాపింగ్‌కు పెరుగుతున్న ఆదరణ వల్లే

న్యూఢిల్లీ, మే 8: దేశంలోని మెట్రో నగరాల్లో ఘోస్ట్‌ మాల్స్‌ అధికమవుతున్నాయి. ఓ షాపింగ్‌ మాల్‌లో అందుబాటులో ఉన్న మొత్తం స్థలంలో 40ు చోటు నిరుపయోగంగా మిగిలిపోతే దానిని ఘోస్ట్‌ మాల్‌ అంటారు. ఇలాంటి మాల్స్‌ సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. 2022లో దేశ వ్యాప్తంగా 57 ఘోస్ట్‌ మాల్స్‌ ఉండగా 2023 నాటికి అది 64కు పెరిగింది. నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా అనే స్థిరాస్తి సంస్థ చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.


ఈ అధ్యయనం ప్రకారం.. ఘోస్ట్‌ మాల్స్‌గా మారిన 64 షాపింగ్‌ మాల్స్‌ విస్తీర్ణం సుమారు 1.33 కోట్ల చదరపు అడుగులు ఉంటుంది. ఆయా మాల్స్‌ వల్ల రూ.6,700 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఆ నివేదిక పేర్కొంది. ఇక, 64 ఘోస్ట్‌ మాల్స్‌లో 21 దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలోనే ఉన్నాయి. తర్వాతి స్థానంలో బెంగళూరు(12 మాల్స్‌) ఉంది. హైదరాబాద్‌లో 4 ఘోస్ట్‌ మాల్స్‌ ఉన్నాయి. ఆన్‌లైన్‌ షాపింగ్‌కు ఆదరణతోనే ఈ మాల్స్‌ పెరుగుతున్నట్లు నివేదిక తెలిపింది.

Updated Date - May 09 , 2024 | 04:46 AM