Share News

Priyanka Gandhi : మోదీకి చికిత్స చేయించండి

ABN , Publish Date - May 26 , 2024 | 06:09 AM

ప్రధాని మోదీ చేసిన ముజ్రా వ్యాఖ్యలపై ఇండియా కూటమి పార్టీల నాయకులు ఘాటుగా స్పందించారు. ‘‘మోదీజీ మీ మానస్థితి ఏమైంది? ఎండలకు దెబ్బతిన్నట్టుంది. అమిత్‌షా, జేపీ నడ్డాలు ఆయనకు తక్షణమే చికిత్స చేయించాలి. బహుశ ఎండ వేడి ఆయన మెదడుపై ప్రభావం చూపిస్తున్నట్టుంది. ఏది బడితే అది

Priyanka Gandhi : మోదీకి చికిత్స చేయించండి

మానసిక స్థితి దెబ్బతిన్నట్టుంది

‘ఇండియా’ నేతల ఘాటు వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, మే 25: ప్రధాని మోదీ చేసిన ముజ్రా వ్యాఖ్యలపై ఇండియా కూటమి పార్టీల నాయకులు ఘాటుగా స్పందించారు. ‘‘మోదీజీ మీ మానస్థితి ఏమైంది? ఎండలకు దెబ్బతిన్నట్టుంది. అమిత్‌షా, జేపీ నడ్డాలు ఆయనకు తక్షణమే చికిత్స చేయించాలి. బహుశ ఎండ వేడి ఆయన మెదడుపై ప్రభావం చూపిస్తున్నట్టుంది. ఏది బడితే అది మాట్లాడుతున్నారు’’ అని కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి పవన్‌ ఖేరా ఎక్స్‌లో పోస్టు చేశారు. మోదీ తన ప్రధాని పదవికి ఉన్న గౌరవాన్ని కాపాడుకోవాలని ప్రియాంకగాంధీ అన్నారు. దేశ చరిత్రలో ఏ ప్రధానీ ఉపయోగించని పదాలను ప్రతిపక్షాల విషయంలో మోదీ ఉపయోగిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రధాని పదవి పోతుందని మోదీ బాగా కలత చెందుతున్నారని, అందుకే ఇలాంటి భాష వాడుతున్నారని ఖర్గే అన్నారు. ‘‘నారీ శక్తి అంటూ వ్యాఖ్యానించిన నాయకుడు ఇప్పుడు ‘ముజ్రా’ అంటూ దిగజారి వ్యాఖ్యానిస్తున్నారు. పదేళ్ల పాలనలో జాగ్రత్తగా దాచుకున్న తన నిజస్వరూపాన్ని చవకబారు పదాలతో ఇప్పుడు బయటపెట్టుకున్నారు’’ అని టీఎంసీ ఎంపీ సాకేత్‌ గోఖలే విమర్శించారు. ‘‘మోదీ తన గొప్పతనం అనే భ్రాంతితో బాధపడుతున్నారు. అందుకే ఆయన నోటి నుంచి మటన్‌, మంగళసూత్రం, ముజ్రా వంటి పదాలు వస్తున్నాయి. ఆయనను చూస్తే బాధగా ఉంది’’ అని ఆర్జేడీ నేత మనోజ్‌ ఝా అన్నారు.

Updated Date - May 26 , 2024 | 06:09 AM