Share News

Emmanuel Macron: భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్ గుడ్ న్యూస్.. 2030నాటికి 30 వేల మంది విద్యార్థులు టార్గెట్

ABN , Publish Date - Jan 26 , 2024 | 10:58 AM

భారత గణతంత్ర వేడుకలకు(India Republic Day - 2024) ముఖ్య అతిథిగా హాజరైన ఫ్రాన్ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్(Emmanuel Macron) భారత్ - ఫ్రాన్స్ మధ్య మైత్రిని బలపరిచే ప్రక్రియలో కీలక ముందడుగు వేశారు. 2030 నాటికి 30 వేల భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్‌లోని విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు కల్పించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు.

Emmanuel Macron: భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్ గుడ్ న్యూస్.. 2030నాటికి 30 వేల మంది విద్యార్థులు టార్గెట్

ఢిల్లీ: భారత గణతంత్ర వేడుకలకు(India Republic Day - 2024) ముఖ్య అతిథిగా హాజరైన ఫ్రాన్ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్(Emmanuel Macron) భారత్ - ఫ్రాన్స్ మధ్య మైత్రిని బలపరిచే ప్రక్రియలో కీలక ముందడుగు వేశారు. 2030 నాటికి 30 వేల భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్‌లోని విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు కల్పించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు.

తద్వారా ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింతగా బలపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా తన పర్యటన రెండు దేశాల మధ్య సంబంధాలును మరింతగా బలోపేతం చేస్తుందని మాక్రాన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఫ్రెంచ్ ఫర్ ఆల్, ఫ్రెంచ్ ఫర్ ఎ బెటర్ ఫ్యూచర్ అనే విధానాన్ని బడుల్లో అమలు చేస్తున్నామని, ఫ్రెంచ్ భాష నేర్చుకునేందుకు శిక్షణ ఇస్తున్నామని వివరించారు.


ఫ్రెంచ్ మాట్లాడలేనివారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ దేశంలోని యూనివర్సిటీల్లో చేరడానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుందని వివరించారు. అక్కడ చదువుకున్న భారత విద్యార్థులకు వీసా ప్రక్రియ క్రమబద్దీకరిస్తామని.. తద్వారా వారు తిరిగి స్వదేశానికి రావడం సులభం అవుతందని చెప్పారు.

2025నాటికి 20 వేల మంది విద్యార్థులను ఫ్రాన్స్‌కి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మాక్రాన్ ప్రభుత్వం 2018లో క్యాంపస్ ఫ్రాన్స్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది ఫ్రాన్స్‌లో చదువుకోవాలనుకునే ఆసక్తి ఉన్న భారతీయ విద్యార్థులకు దోహదపడుతోంది. దీన్ని ప్రారంభించిన తరువాత అక్కడి యూనివర్సిటీల్లో చదువుకుంటున్న విద్యార్థుల సంఖ్య 20 శాతానికిపైగా పెరిగింది.

Updated Date - Jan 26 , 2024 | 11:30 AM