ఇందిర ‘మదర్ ఆఫ్ ఇండియా’: సురేశ్ గోపి
ABN , Publish Date - Jun 16 , 2024 | 05:07 AM
కేంద్రమంత్రి సురేష్ గోపి మాజీ ప్రధాని ఇందిరాగాంధీని ‘మదర్ ఆఫ్ ఇండియా’గా అభివర్ణించారు. అలాగే కేరళలో దివంగత కాంగ్రెస్ ముఖ్యమంత్రి కె. కరుణాకరన్(కాంగ్రె్‌స)ని ధైర్యంగల పరిపాలనాదక్షుడు అన్నారు. కరుణాకరన్, మార్క్సిస్ట్ వెటరన్ ఇ.కె. నయనార్‌లను తన రాజకీయ
న్యూఢిల్లీ, జూన్ 15: కేంద్రమంత్రి సురేష్ గోపి మాజీ ప్రధాని ఇందిరాగాంధీని ‘మదర్ ఆఫ్ ఇండియా’గా అభివర్ణించారు. అలాగే కేరళలో దివంగత కాంగ్రెస్ ముఖ్యమంత్రి కె. కరుణాకరన్(కాంగ్రె్‌స)ని ధైర్యంగల పరిపాలనాదక్షుడు అన్నారు. కరుణాకరన్, మార్క్సిస్ట్ వెటరన్ ఇ.కె. నయనార్‌లను తన రాజకీయ గురువులుగా పేర్కొన్నారు. కేరళలోని త్రిశ్శూర్‌లో కరుణాకరన్ స్మారక మురళి మందిరాన్ని శనివారం సందర్శించిన అనంతరం సురేష్ గోపి విలేకరులతో మాట్లాడుతూ... ఈ వ్యాఖ్యలు చేశారు. తాను కరుణాకరన్ స్మారక మందిరాన్ని సందర్శించడానికి ఎటువంటి రాజకీయ రంగు పులమవద్దని విలేకరులను సురేష్ గోపి కోరారు. తన గురువుకు నివాళులు అర్పించేందుకే తాను ఇక్కడికి వచ్చానని చెప్పారు. కరుణాకరన్‌ను కేరళలో కాంగ్రెస్ పార్టీకి తండ్రివంటివారని సురేశ్ గోపి పేర్కొన్నారు. 2019లోనే తాను మురళి మందిరాన్ని సందర్శించాలనుకొన్నా బీజేపీలో చేరిన కరుణాకరన్ కుమార్తె పద్మజా వేణుగోపాల్ రాజకీయ కారణాల వల్ల వద్దని చెప్పారని అన్నారు.