Share News

మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం

ABN , Publish Date - Mar 01 , 2024 | 04:44 AM

మధ్యప్రదేశ్‌లో గురువారం ఘోర ప్రమాదం జరిగింది. ఓ కార్యక్రమానికి వెళ్లి వస్తున్న పికప్‌ వాహనం బోల్తా పడిన ఘటనలో 14 మంది మరణించారు. మరో 20 మంది గాయపడ్డారు.

మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం

వాహనం లోయలోపడి 14 మంది మృతి

దిండోరి, ఫిబ్రవరి 29: మధ్యప్రదేశ్‌లో గురువారం ఘోర ప్రమాదం జరిగింది. ఓ కార్యక్రమానికి వెళ్లి వస్తున్న పికప్‌ వాహనం బోల్తా పడిన ఘటనలో 14 మంది మరణించారు. మరో 20 మంది గాయపడ్డారు. ‘‘దిండోరి జిల్లా బంద్‌ఝర్‌ ఘాట్‌ మూల మలుపు వద్ద డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. వాహనం 50 అడుగుల లోయలో బోల్తా పడింది. తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటనలో 14 మంది చనిపోయారు. క్షతగాత్రుల్లో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది’’ అని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తలా రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు 50వేల రూపాయలను పరిహారంగా ప్రధాని మోదీ ప్రకటించారు. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం చనిపోయిన ఒక్కో బాధిత కుటుంబానికి రూ. 4 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది.

Updated Date - Mar 01 , 2024 | 07:57 AM