Share News

భర్తను కాదని నేరుగా పిల్లలకు ఫ్యామిలీ పెన్షన్‌

ABN , Publish Date - Jan 03 , 2024 | 03:50 AM

వివాహ బంధానికి సంబంధించిన కేసులు కోర్టులో పెండింగ్‌లో ఉన్నప్పుడు మహిళా ఉద్యోగులు తమ ఫ్యామిలీ పెన్షన్‌ భర్తకు బదులు పిల్లలకు చెందేలా ఆప్షన్‌ ఇచ్చుకోవచ్చు.

భర్తను కాదని నేరుగా పిల్లలకు ఫ్యామిలీ పెన్షన్‌

న్యూఢిల్లీ, జనవరి 2: వివాహ బంధానికి సంబంధించిన కేసులు కోర్టులో పెండింగ్‌లో ఉన్నప్పుడు మహిళా ఉద్యోగులు తమ ఫ్యామిలీ పెన్షన్‌ భర్తకు బదులు పిల్లలకు చెందేలా ఆప్షన్‌ ఇచ్చుకోవచ్చు. పిల్లలను నామినీగా పెట్టుకోవచ్చు. ఈ మేరకు మంగళవారం కేంద్ర పెన్షన్లు, పెన్షనర్ల సంక్షేమ విభాగం మార్గదర్శకాలు జారీ చేసింది. విడాకుల పిటిషన్‌, భర్తపై గృహ హింస నిరోధక చట్టం కింద పెట్టిన కేసులు, వరకట్నం కేసులు పెండింగ్‌లో ఉన్నప్పుడు మహిళా ఉద్యోగులు ఇలాంటి నిర్ణయం తీసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా శాఖాధిపతికి దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుందని పెన్షనర్ల సంక్షేమవిభాగం కార్యదర్శి శ్రీనివాస్‌ తెలిపారు.

Updated Date - Jan 03 , 2024 | 06:55 AM