Share News

Ayodhya: అంతా రామమయం.. నగరమంతా పండుగ శోభ

ABN , Publish Date - Jan 21 , 2024 | 04:54 AM

ఆధ్యాత్మిక నగరం అయోధ్యకు పండుగ కళ వచ్చింది. బాల రాముడి విగ్రహం ప్రాణప్రతిష్ఠ మహోత్సవం నేపథ్యంలో రకరకాలైన పూలతో చేసిన అలంకరణలు, విద్యుత్‌ దీపాల కాంతులతో ఇక్కడి రామమందిరం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. ఆలయాన్ని, పరిసరాలను దేశం నలుమూలల నుంచి

Ayodhya: అంతా రామమయం.. నగరమంతా పండుగ శోభ

అయోధ్య కళకళ.. పుష్పాలు, దీపాలతో ఆలయానికి అలంకారం

ఎటుచూసినా రాముడి కటౌట్లతో నగరమంతా పండుగ శోభ

హైదరాబాద్‌ నుంచి అయోధ్యకు 1,265 కిలోల లడ్డూ ప్రసాదం

వెయ్యేళ్లు మన్నేలా రామాలయం.. అత్యద్భుతం.. రామయ్య విగ్రహం

బాలరాముడి ఫొటోల లీక్‌పై దర్యాప్తు జరపాల్సిందే.. ట్రస్ట్‌ ఆగ్రహం

అమెరికాలో వెయ్యి ఆలయాల్లో వేడుకలు.. హ్యూస్టన్‌లో కార్ల లైట్‌షో

అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ రేపే

నగరానికి పండుగ కళ .. పుష్పాలు, దీపాలతో ఆలయానికి అలంకారం

అంతటా రామమందిరం, రాముడి కటౌట్లు, రామనామ స్మరణ

హైదరాబాద్‌ నుంచి 1,265 కిలోల లడ్డూ ప్రసాదం

అయోధ్య, జనవరి 20: ఆధ్యాత్మిక నగరం అయోధ్యకు పండుగ కళ వచ్చింది. బాల రాముడి విగ్రహం ప్రాణప్రతిష్ఠ మహోత్సవం నేపథ్యంలో రకరకాలైన పూలతో చేసిన అలంకరణలు, విద్యుత్‌ దీపాల కాంతులతో ఇక్కడి రామమందిరం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. ఆలయాన్ని, పరిసరాలను దేశం నలుమూలల నుంచి తెప్పించిన విభిన్న రకాలైన పుష్పాలతో సుందరంగా అలంకరించారు. వీటి నుంచి వెలువడుతున్న సువాసన భరితమైన పరిమళాలు ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చాయి. పూల అలంకరణ, విద్యుత్‌ దీపాల ఏర్పాటు కోసం ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేశామని, ట్రస్టు అధికారుల పర్యవేక్షణలో వారంతా పనిచేస్తున్నారని ఆలయ వర్గాలు తెలిపాయి. అయితే గర్భాలయంలో మాత్రం సంప్రదాయ మట్టి ప్రమిదలతో కూడిన దీపాలనే వెలిగించనున్నట్లు పేర్కొన్నాయి. అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం సందడి ఆకాశాన్నంటుతోంది. నగరమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని ఉంది. ఒక ప్రభుత్వ రంగ బ్యాంకు తన నూతన శాఖను ఇక్కడి రామ్‌ పథ్‌లోని భవనంలో గత గురువారం ప్రారంభించింది. దానికి రామజన్మభూమి బ్రాంచ్‌గా పేరు పెట్టింది. ఈ కార్యాలయం గోడపై అమర్చిన భారీ బ్యానర్‌లో బ్యాంకు పేరుతో పాటు రామమందిరం ఫొటో ఉంచారు. ‘‘అయోధ్య నగరంలోకి స్వాగతం’’ అంటూ ఇక్కడి రైల్వేస్టేషన్‌ సమీపంలో ఉన్న మరో బ్యాంకు పెద్ద హోర్డింగ్‌ను ఏర్పాటు చేసింది. దానిలో రామమందిరంతో పాటు ధనస్సును పట్టుకున్న రాముడి చిత్రం కూడా ఉంది. ఇక రామమందిరం ఫొటో ముద్రించిన విజిటింగ్‌ కార్డులు, పోస్టర్లు, కేలండర్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇక్కడి ఆలయాలు, బస్సులు, వీధులు, చివరికి మొబైల్‌ ఫోన్‌ కాలర్‌ ట్యూన్లు... ఇలా ఎటు చూసినా అంతా రామమయంగా మారిపోయింది. ఇక హోటళ్లు, లాడ్జీలు, దుకాణాలు ప్రతిచోటా రాముడి చిత్రంతో కూడిన బ్యానర్లు, జెండాలు దర్శనమిస్తున్నాయి.

Updated Date - Jan 21 , 2024 | 06:43 AM